Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే కేవలం గంటల వ్యవదిలోనే పైరసీలు చేస్తున్నారు. ఇలా పైరసీ చేయడం వల్ల నిర్మాతలు ప్రతి సంవత్సరం కూడా వేల కోట్లు నష్టపోతున్నారు. దాంతో పైరసీని అరికట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఒక్క ప్రయత్నం కూడా సఫలం కావడం లేదు. తాజాగా ఒక తమిళ నిర్మాత తన సినిమా విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ పైరసీపై చాలా ఆందోళన వ్యక్తం చేశాడు. తమిళంకు చెందిన దాదాపు అన్ని సినిమాలను కూడా తమిళ రాకర్స్ అనే వెబ్ సైట్ పైరసీ చేస్తుంది. ఆ సైట్‌కు పైరసీ ఎలా దొరకుతుంది, అసలు పైరసీ వీడియోలను వారు ఎక్కడ నుండి తీసుకుంటున్నారు, ఆ సైట్ ఎక్కడ నుండి రన్ అవుతుందనే విషయం ఎవరికి తెలియకుండా ఉంది.
తాజాగా ‘వెలైక్కారన్’ అనే చిత్రం తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పైరసీని అడ్డుకునేందుకు నిర్మాత మీడియా ముందు తమిళ రాకర్స్ సైట్‌ను ప్రాదేయ పడ్డాడు. ఎంతో కష్టపడి చిత్రాన్ని నిర్మించాం, దయచేసి సినిమాను పైరసీ చేయవద్దని, కాస్త ఆలస్యంగా అయినా పైరసీ చేయాని కోరాడు. కాస్త ఆలస్యంగా పైరసీ చేయాలంటూ ఆ నిర్మాత కోరడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోట్లు పెట్టి ఒక చిత్రాన్ని నిర్మించిన నిర్మాత తన సినిమాను ఆలస్యంగా పైరసీ చేయండి అంటూ వెబ్ సైట్‌ను కోరడం చాలా దారుణంగా ఉంది. పైరసీ ఏ స్థాయిలో నిర్మాతల జీవితాలను నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ నిర్మాత పైరసీ కావదని ప్రాదేయపడుతున్నాడు.