సినిమాలనే కాదు ట్వీట్స్‌ను కాపీ చేస్తోన్న వర్మ

varma copying tweets
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి మీడియాలో ఉంటూ వస్తాడు. హాలీవుడ్‌ సినిమాలను కాపీ చేస్తాను అంటూ తన గురించి తాను చెప్పుకునే వర్మ తాజాగా ఒక ట్వీట్‌ను కాపీ చేసి విమర్శల పాలయ్యాడు. తాజాగా క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ బంద్‌కు నిర్వచనంగా పని లేని వారు పని చేసుకునే వారిని డిస్ట్రబ్‌ చేయడం అంటూ చెప్పుకొచ్చాడు. అదే ట్వీట్‌ను కాస్త మార్చి వర్మ పోస్ట్‌ చేశాడు. కైఫ్‌ ట్వీట్‌ చేసిన 11 గంటలకు వర్మ అదే ట్వీట్‌ను చేయడం ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది.

సినిమాలను కాపీ కొట్టే వర్మ ఇలా ట్వీట్స్‌ను కూడా కాపీ కొట్టే స్థితికి దిగజారి పోయాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్మ పద్దతి ఏమాత్రం కరెక్ట్‌ కాదని, వర్మ రాను రాను క్రియేటివిటీని వదిలేస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ తెలుగులో రెండు చిత్రాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అందులో మొదటిది నాగార్జునతో కాగా రెండవది ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందబోతున్న చిత్రం. ఈ రెండు చిత్రాలతో పాట ‘కడప’ అనే వెబ్‌ సిరీస్‌ను కూడా వర్మ చేస్తున్న విషయం తెల్సిందే. ఇవన్ని కూడా తన గత చిత్రాల నుండి, హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాల నుండి కాపీ చేస్తున్నవే అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.