Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం అందరి కన్నా ఆతృతగా ఎదురుచూస్తోంది డైరెక్టర్ తేజ. ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన తేజ చానాళ్లుగా ఒక్క హిట్టూ లేక అల్లాడుతున్నారు. ఆయన సినిమాలు కొన్నేళ్లుగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఓ మంచి హిట్ ఆయన కెరీర్ కు చాలా అవసరం. నేనే రాజు నేనే మంత్రి హిట్ అయితే తేజ కెరీర్ మళ్లీ గాడిలో పడుతుంది. లేకపోతే ఆయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం కష్టమే. వరుస ఫ్లాపుల్లో ఉన్నా తేజ సినిమాకు ఇంత క్రేజ్ రావటానికి కారణం స్టార్ హీరో, హీరోయిన్లు రానా, కాజల్ ఇందులో నటిస్తుండటం వల్లే.
బాహుబలి 2 తర్వాత రానా నటిస్తున్నసినిమా ఇదే కావటం, కాజల్ తొలిసారి రానాతో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాకు బాగా హైప్ వచ్చింది. పస్ట్ లుక్ కు, టీజర్లకు కూడా భారీ రెస్పాన్స్ లబించింది. సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా కావటంతో విజయంపై రానా, కాజల్, తేజ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్ కాజల్ అయితే డైరెక్టర్ ను, సినిమాను తెగపొగిడేస్తున్నారు.
పన్నెండేళ్ల క్రితం తేజ సినిమా లక్ష్మీకళ్యాణం ద్వారానే తెలుగు తెరకు పరిచయమైన కాజల్ మళ్లీ ఇన్నాళ్ల తరువాత తేజ డైరెక్షన్ లో నటించింది. ఎక్కువగా కొత్త వాళ్లతో సినిమాలు తీసే తేజ ఈ సారి మాత్రం స్టార్ లను నమ్ముకున్నారు. తెలుగు తెరకు కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తూ …వాళ్ల నుంచి తనకు కావాల్సన నటనను రాబట్టుకునేందుకు నటీనటులను చెంపదెబ్బలు కొడతారనే బ్యాట్ ఇమేజ్ తెచ్చుకున్న తేజ ఈ సారి మాత్రం స్టార్లతో చాలా జాగ్రత్తగా వ్యవహిరించినట్టుంది. ఎప్పుడూ ఎవరిని పొగడని తేజ హీరో రానాను మాత్రం ప్రశంసల్లో ముంచెత్తాడు. రానా చాలా ఇంటిలెజెంట్ ఆర్టిస్ట్ అని తేజ చెప్పారు.
ఓ సీన్ వివరిస్తే…రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ…పొద్దున్నే షూటింగ్ లో ఆ సన్నివేశానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారని, ఇలాంటి నటులు చాలా అరుదుగా ఉంటారని, సెట్ లో రానాలా కాకుండా జోగేంద్రలా వ్యవహరించేవారని పొగడ్తల వర్షం కురిపించారు. నేనే రాజు నేనే మంత్రి తప్పుకుండా విజయం సాధిస్తుందని…ఇన్నాళ్లూ తాను కథల పరంగా విఫలమయ్యానని, ఈ సారి అలాంటి పొరపాటు జరిగే అవకాశం లేదుని చెప్పుకొచ్చారు. మొత్తానికి తన యాటిట్యూడ్ కు భిన్నంగా స్టార్లతో సినిమా తీసి…వారిని పొగడ్తలలో ముంచెత్తుతున్న తేజను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మారిన మనిషి అంటోంది. అందుకు తగ్గట్టుగా నేనే రాజు నేనే మంత్రి హిట్టయితే ఈ మార్పు మంచి ఫలితాన్ని ఇచ్చినట్టే.
మరిన్ని వార్తలు: