తేజ సంచలన నిర్ణయం

Director Teja Gives movie Offer to Sri Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్ని రోజులుగా కాస్టింగ్‌ కౌచ్‌పై తీవ్ర స్థాయిలో అభ్యంతర వ్యాఖ్యు చేస్తున్న శ్రీరెడ్డికి దర్శకుడు తేజ ఆఫర్స్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. తాజాగా ఒక వెబ్‌ మీడియా ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి తాను ఇండస్ట్రీలో పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టేసింది. దాంతో పాటు ఆమె తనను ఇండస్ట్రీలో ఎంత మంది వాడుకునేందుకు చూశారో కూడా చెప్పింది. ఇండస్ట్రీ పెద్దలపై కూడా చాలా దురుసుగా వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి ఇటీవలే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది. అవకాశాలు రావడం లేదనే ఉద్దేశ్యంతోనే తాను అలాంటి వ్యాఖ్యలు చేశాను అని, క్షమించాలంటూ శ్రీరెడ్డి మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి పడుతున్న కష్టాలకు చలించిపోయిన తేజ తాజాగా ఆమెకు ఆఫర్స్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతుంది. త్వరలోనే ఆ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. దాంతో పాటు బాలకృష్ణతో ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని కూడా తేజ తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో కూడా శ్రీరెడ్డిని ముఖ్య పాత్రలకు తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తేజతో పాటు ఇంకా పలువురు దర్శకులు మరియు నిర్మాతలు కూడా ఆమెకు అవకాశాలు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. శ్రీరెడ్డి ఇంత కాలం పడ్డ కష్టాలకు ఇక ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లే అని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఒక్క ఇంటర్వ్యూతో ఆమె జీవితం మారిపోయిందని, ఆమెలాంటి వారు ఎంతో మంది ఇండస్ట్రీలో మగ్గి పోతున్నారు. వారందరు కూడా మంచి అవకాశాలు దక్కించుకోవాలని ఆశిద్దాం.