Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బండ్లు ఓడలు కావడం, ఓడలు బండ్లు కావడం అనేది ఇండస్ట్రీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక సహాయ దర్శకుడిగా ఇండ్రస్టీకి పరిచయం అయిన వైవీఎస్ చౌదరి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అంటే ఆయన బండి కాస్త ఓడ అయ్యిందన్నమాట. ఇండస్ట్రీలో నిలకడ చాలా అవసరం. తన స్థాయి, తన మార్కెట్‌ను, తాను చేస్తున్న సినిమా చేయబోతున్న బిజినెస్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే పరిస్థితి ఇలా అవుతుంది అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ వైవీఎస్ చౌదరి.
తక్కువ సమయంలోనే స్టార్‌డంను సంపాదించిన చౌదరి అంతే తక్కువ సమయంలో వచ్చిన స్టార్‌డంను పూర్తిగా కోల్పోయాడు. ఇక ఆయన ఆర్థిక పరిస్థితులు కాస్త తిరగబడ్డాయి. మొదట చెప్పిన సామెత నిజం అయ్యింది. ఏమాత్రం క్రేజ్ లేని సాయి ధరమ్ తేజ్‌తో భారీ మొత్తంలో బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అనేది చౌదరి చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకు ఆయన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చౌదరి ఆస్తులు అన్ని అమ్మేశాడు. ఇంకా కూడా అప్పులు, తిప్పలు తప్పడం లేదు. దాంతో ఇటీవల ఆత్మహత్య యత్నం చేశాడని, కుటుంబ సభ్యులు సరైన సమయంలో స్పందించడంతో ఆయన్ను ప్రాణాలతో కాపాడగలిగారు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పూరి డ్రగ్స్ వ్యవహారం కారణంగా చౌదరి ఇష్యూ మీడియాలో ఎక్కువ ఫోకస్ కాలేదు.
మరిన్నివార్తలు