కంచే చేను మేస్తే, పదిమందికి న్యాయం చెప్పాల్సిన వారే దౌర్జన్యానికి పాల్పడితే ఏమనాలి. తమకు అన్యాయం జరిగిందని ఎంతో మంది న్యాయం కోసం న్యాయస్థానాలు ఆశ్రయిస్తారు. అలాంటి న్యాయమూర్తే తన కూతురు విషయంలో క్రూరంగా ప్రవర్తించారు. తన కూతురు ప్రేమ వ్యవహారంలో తన క్రూరత్వాన్ని కిరాతకాన్ని ప్రదర్శించారు. తన కూతురు ఒకతన్ని ప్రేమిస్తుందని తెలుసుకుని అతన్ని కలుసుకోకుండా ఇంట్లో బంధించి ఆమెను చితకబాధారు. అంతేకాదు ఆమె ఏడుస్తుంటే ఆ శబ్ధాన్ని ఫోన్ ద్వారా ప్రియునికి వినిపించి రాక్షసానందం పొందాడు. ఈ దారుణ సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖగారియా జిల్లా ,షెషన్స్ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న సుభాష్ చంద్ర చౌరాసియా కూతురు యశశ్వినీ, సిద్ధార్థ బన్సాల్ ప్రేమించుకున్నారు.
సిద్ధార్థ సుప్రీంకోర్టులో లాయర్ యశశ్వినీ కూడా లా స్టూడెంట్ యే ఆమె పాట్నాలో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వాళ్లిద్దరు 2012లో సాకేట్ కోర్టు కాంప్లెక్స్ లో కలిసి అక్కడ ప్రేమలో పడ్డారు, ఈ నేపథ్యంలో యశశ్వనీ ఢిల్లీ జుడిషియల్ సర్వీస్ పరీక్ష రాసేందుకు తన తల్లితో కలిసి ఢిల్లీకి వచ్చారు. ఆ సమయంలో సిద్దార్థ, యశశ్వినీ కలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి సిద్దార్థను మందలించింది. ఇద్దరి మధ్య చిన్న పాటి వాగ్వాదం జరిగింది. దీంతో పరీక్ష రాయకుండానే పాట్నకు తిరిగి వచ్చారు. అనంతరం ఆమె తల్లిదండ్రులు ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ప్రియుడు సిద్ధార్థకు ఫోన్ చేసి యశశ్వినినీ ఏడుస్తున్న శబ్దాన్ని వినిపించారు. దీంతో సిద్ధార్థ ఆమెను రక్షించేందుకు పాట్నాలోని యశశ్వినీ ఇంటికి వచ్చినా అతన్ని తిప్పి పంపారు. విషయం ఇప్పుడు మీడియా దాకా రావడంతో ఇప్పుడు అంతా ఆ సాడిస్ట్ న్యాయమూర్తిని దుమ్మెత్తి పోస్తున్నారు.