ఉక్కు దీక్షకి పెరుగుతున్న మద్దతు… మరింత క్షీణించిన ఆరోగ్యాలు

CM Ramesh Hunger Strike for Kadapa Steel factory

కడపలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసనమండలి సభ్యుడు బీటెక్ రవిలు చేస్తున్న ఆమరణ దీక్ష ఏడవ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే అయితే వారి ఆరోగ్యం మరింతగా క్షీణించిందని ఈ ఉదయం వారిని పరీక్షించిన వైద్యుల బృందం వెల్లడించింది. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను కొనసాగించరాదని, మరో రోజు ఆహారం తీసుకోకుంటే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదముందని వైద్యులు తెలిపారు. వెంటనే వీరిని ఆసుపత్రులకు తరలించాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు.

దీంతో వీరి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో  ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే వీరి దీక్షకు పొరుగు రాష్ట్రాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. టీడీపీ నాయకులు చేపట్టిన దీక్షకు తమిళనాడులో ముఖ్య పార్టీయైన డీఎంకే మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత కనిమొళి ఈరోజు కడపకు వచ్చి దీక్షకి సంఘీభావం తెలపనున్నారు.