జానీ మూవీ ప్లాప్ తరవాత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో తెలుసా ?

Power Star Pawan Kalyan
Power Star Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ” గోకులంలో సీత” “సుస్వాగతం” వంటి సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. నాలుగో మూవీ “తొలిప్రేమ “ఈ చిత్రం కూడా భారీ విజయం సాధించి పవన్ కళ్యాణ్ కి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం “బద్రి” కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తరువాత వచ్చిన “ఖుషీ” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పవన్ కళ్యాణ్ కి యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ తెచ్చుకుంది.

“ఖుషీ” మూవీ తరువాత పవన్ కళ్యాణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో జానీ సినిమా చేశాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రం ద్వారా పవన్ తొలిసారి మెగాఫోన్ పట్టాడు. రేణు దేశాయ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి రమణ గోగుల సంగీతాన్ని అదిoచారు. భారీ వ్యయంతో, హై టెక్నికల్ వాల్యూస్ తో అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైన జానీ మూవీ ఫ్లాప్ అయింది. ఈ చిత్రంలో కథ బాగానే ఉన్నప్పటికి కథనం ఆకట్టుకోకపోవడమే జానీ పరాజయానికి కారణం అని చెప్పవచ్చు.

ఈ చిత్రం గురించి చాలా మంది విశ్లేషకులు ఇప్పటికీ పలు కారణాలను చెబుతుంటారు. జానీ తల్లి మరణం తరువాత మార్షల్ ఆర్ట్స్ కోచ్ అయ్యాడు పవన్ కళ్యాణ్. అదేవిధంగా గీత అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు క్యాన్సర్ ఉందని తెలుసుకున్న తరువాత జానీ.. ఆమె వైద్య చికిత్స కోసం ఇతర మార్షల్ ఆర్ట్స్ సిబ్బందితో పోటీ పడి గెలిచాడు.జానీ మూవీ ఫ్లాప్ అయ్యాక ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాస్ అవ్వకూడదని చెప్పి తన రెమ్యునరేషన్ మొత్తం డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేశారట పవన్ కళ్యాణ్. అంతేకాదు..

ఎంతో ఇష్టంగా వ్యవసాయం చేసుకుందాం అని కొనుక్కున్న ల్యాండ్ ని కూడా అమ్మేసి డబ్బులు ఇచ్చేద్దామనుకున్నారట. కానీ నాగబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్లు ఆయనను ఆపి ఇష్టంగా వ్యవసాయం చేసుకుందామని చెప్పి ఆ ల్యాండ్ ని నువ్వు కొనుక్కున్నావు అని.. అది తప్ప నీ సొంతం అయింది ఏది లేదని..ఇది మాత్రం అస్సలు అమ్మకు అని మందలించడంతో పవన్ కళ్యాణ్ ఆ ల్యాండ్ ని అమ్మలేదట. ఇక ఇదే విషయాన్ని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో చెబుతూ పవన్ కళ్యాణ్ తన కోసం ఏదైనా ఉందా లేదా అని ఏది చూడడు అని, ఒకవేళ ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే మాత్రం.. ముందుండి హెల్ప్ చేస్తారని నాగబాబు చెప్పారు. ఇక ఎంతైనా పవన్ కళ్యాణ్ మంచితనాన్ని మాటల్లో వర్ణించలేం.