Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పుడైతే పార్లమెంట్ లో విభజన సమస్యల మీద ఆంధ్రోరదేశ్ ఎంపీల గళం వినిపించడం మొదలైందో అప్పటి నుంచి బీజేపీ నేతలకు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి భూతద్దంలో కనిపిస్తోంది. అది మాత్రమే కాదు. మోడీ సర్కార్ ఏపీ కి విదిల్చిన ఆవాలు అంత నిధులు కూడా కమలనాథులకు గుమ్మడి కాయల్లా కనిపిస్తున్నాయి. సోము వీర్రాజు , కన్నా , పురందేశ్వరి లాంటి వాళ్ళు ఎలా మాట్లాడినా కాస్తో కూస్తో పద్ధతిగా వ్యవహరిస్తాడన్న పేరున్న విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు సైతం కేంద్రం ఇచ్చిన ప్రకటనల జాబితా చూపి లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చాయని చెప్పడం ఎంతవరకు సమంజసమో ?. కేంద్రం మీద ప్రత్యేక హోదా సహా వివిధ విభజన సమస్యల పరిష్కారానికి జాక్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్న పవన్,జేపీ , ఉండవల్లి లాంటి వాళ్ళు హరిబాబు కామెంట్స్ మీద ఎందుకు మాట్లాడడం లేదో అర్ధం కావడం లేదు.
నిధులు ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి రాష్ట్రాన్ని లెక్కలు అడగడం గురించి ఈ ముగ్గురు తర్జనభర్జన పడడం ఆశ్చర్యంగా వుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పిన లెక్కలు శుద్ధతప్పు అని పవన్ కి తెలుసో ,లేదో గానీ జేపీ , ఉండవల్లికి బాగా తెలుసు. అయినా ఇప్పటిదాకా వాళ్ళు ఆ విషయం మీద మాట్లాడకపోవడంతో సోము వీర్రాజు లాంటి వాళ్ళు ఇంకాస్త రెచ్చిపోతున్నారు. కానీ వీరి లాగానే ఏ పార్టీ గొడుగు కింద లేకుండా ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మాజీ ఎంపీ , మంత్రి కొణతాల రామకృష్ణ మాత్రం నిజాలు మాట్లాడారు. మోడీ సర్కార్ చెప్పిన ప్రకటనల జాబితా చదివిన హరిబాబుని అడ్డుకున్నారు. హరిబాబు మాటల్లో నిజం లేదని కుండబద్దలు కొట్టాడు. జాక్ ఏర్పాటు చేసే ముందే బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రకటనలను ఖండించకుండా మౌనం వహించి రేపు ఎప్పుడో గొంతు ఎత్తినా ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో పవన్ ,జేపీ ,ఉండవల్లి కాస్త కొణతాల ని ఫాలో అయితే బెటర్. ఆయన మాటల్లో నిజానిజాలు గుర్తించి గొంతు ఎత్తితే మేలు.