తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కర్కార్ ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీలో కూడా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేత చేసిన ఈ ముందస్తు వ్యాఖ్యలు సంచలనానికి తెరలేపాయి. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ – మే నెలలో జరుగుతాయి. కానీ ఈ సారి ఎన్నికలు ముందుగా అంటే జనవరిలోనే జరుగుతాయని దానికి పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని జగన్ పిలుపునివ్వడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశ్హాకా నగరంలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు.
నిన్న పార్టీ ముఖ్య నేతలతో జగన్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ జగన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే నిన్న నవరత్నాలు పోస్టర్ విడుదల చేసిన ఆయన ఈ నెల 17 నుండి ఇంటింటికీ తిరిగి నవరత్నాల మీద అవగాహన కల్పించాలని నేతలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాక నిన్న పీకే టీం నిర్వచించిన సర్వే ప్రకారం నియకవర్గాల్లో వీక్ గా ఉన్న ఇన్ చార్జ్ లకు జగన్ క్లాస్ పీకారని తెలుస్తోంది. మొత్తానికి జగన్ కు కేంద్రం ఏమైనా సంకేతాలు ఇచ్చిందో లేక శ్రేణులను ఉత్సాహ పరచడానికి జగన్ ముందస్తు ఎన్నికలంటూ ప్రకటన చేసారో. తెలంగాణాలో వ్యాపించిన ఎలక్షన్ ఫీవర్ ఇప్పుడు ఏపీలో కూడా వ్యాపించడానికి సిద్దమయ్యింది.