Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నిక జరుగుతుండగానే… వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. నంద్యాల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చిచంపినా, ఉరితీసినా తప్పులేదని జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. జగన్ పై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రజాస్వామ్యదేశంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కాల్చిచంపాలని బహిరంగంగా వ్యాఖ్యానించటం తీవ్ర అభ్యంతరకమరమని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అతిక్రమించినట్టేనని, జగన్ పై తక్షణమే చర్య తీసుకోవాలని ఆదేశాలిచ్చింది.
నంద్యాల ఉప ఎన్నికను మూడేళ్ల టీడీపీ పాలనపై రెఫరెండంగా భావిస్తున్న జగన్ అక్కడ గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు కొన్ని రోజుల ముందే 2019లో అధికారమే లక్ష్యమంటూ నవరత్నాలను ప్రకటించిన… వైసీపీ అధినేత నంద్యాల లో కొత్త తరహా ప్రచారం మొదలుపెట్టారు. ప్రశాంత్ కిషోర్ సలహానో, వ్యక్తిగత ఆలోచనో తెలియదు కానీ… ముఖ్యమంత్రిపై పరిధిని దాటి విమర్శలు చేయటమనే కొత్త పద్ధతిలో ప్రచారం నిర్వహించారు. అప్పటిదాకా రాజకీయాల్లో కాస్త హుందాగానే ఉన్న వైసీపీ అధినేత నంద్యాల లో ఈ రకమైన ప్రచారం చేయటం రాజకీయాల్లో పెను దుమారం లేపింది.
చంద్రబాబుపై ఆయన చేసిన విమర్శలను టీడీపీకే కాక రాజకీయపక్షాలన్నీ తప్పుబట్టాయి. పార్టీలకతీతంగా నేతలు జగన్ వ్యాఖ్యలను ఖండించారు. అటు జగన్ ఏ స్థాయికి దిగజారి విమర్శలు చేసినా…చంద్రబాబు మాత్రం హుందాగానే స్పందించారు. నంద్యాలలో ప్రచారం నిర్వహించిన బాబు…తనను కాల్చిచంపమన్న వాళ్లను కాల్చొద్దు…ఉరితీయొద్దు…ఓటుతోనే ఖతం చేయండి అని ఓటర్లకు పిలుపునిచ్చారు. మొత్తానికి సర్వత్రా విమర్శలు వ్యక్తమయిన జగన్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా స్పందించటంతో వైసీపీ ఆత్మరక్షణలో పడినట్టయింది.
మరిన్ని వార్తలు:
తండ్రి అలా..కొడుకు ఇలా
తీర్పు వెనక షయరా బానో
ఆ సెక్స్ రాకెట్‌తో ఇద్దరు సినీ ప్రముఖులకు సంబంధం!