Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కోహ్లి ఇచ్చిన బ్యాట్ ఉపయోగించకుండా ఉండటం నా వల్ల కాదు అంటోంది ఓ మహిళా అభిమాని. మరంతే కదా… తన అభిమాన క్రికెటర్ బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌ను ఉపయోగించకుండా ఉండటం ఏ అభిమానికయినా సాధ్యమయ్యేపనేనా… అందరిలానే ఆ అభిమాని కూడా ఆ బ్యాట్ వాడుకునేందుకు తెగ ఆరాటపడుతోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే విరాట్ కోహ్లీ వీరాభిమాని సాధారణ అమ్మాయి కాదు. ఓ క్రికెటర్. అదీ ప్రపంచకప్ సాధించిన టీమ్ లో సభ్యురాలు. ఆమే ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్.
క్రికెట్ అభిమానులు ఎవరూ డానియెల్లిని మర్చిపోలేరు. 2014లో సోషల్ మీడియా ద్వారా కోహ్లీని పెళ్లిచేసుకుంటావా… అని ఓ సాధారణ అభిమానిలా అడిగింది డానియెల్లీ యాట్. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయింది. అయితే 2014కు ముందే అనుష్కశర్మతో ప్రేమలో మునిగితేలుతున్న విరాట్ కోహ్లీ డానియెల్లీ ప్రపోజల్ ను అంగీకరించలేదు. 2014లో ఓ పర్యటన సందర్భంగా విరాట్ డానియెల్లీని కలుసుకున్నారు. ఆ సందర్భంగా ఈ వన్ సైడ్ ప్రేమికురాలికి తన బ్యాట్ బహూకరించాడు విరాట్. ఇప్పుడు డానియెల్లీ మాట్లాడేది ఆ బ్యాట్ గురించే.
కోహ్లీ కానుకగా ఇచ్చిన బ్యాట్ ను 2014 నుంచి అపురూపంగా దాచుకున్న డానియెల్లీ ఇప్పుడు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. దాని గురించే ట్విట్టర్లో కామెంట్ పెట్టింది. ఈ వారం తిరిగి శిక్షణలో పాల్గొంటున్నానని, ఈ బ్యాట్ ఉపయోగించుకునేందుకు వేచి ఉండటం తన వల్ల కాదని డానియెల్లీ ట్వీట్ చేసింది. తనకు బ్యాట్ బహూకరించినందుకు విరాట్ కు థ్యాంక్స్ చెప్పబడంతో పాటు ట్విట్టర్ లో బ్యాట్ ఇమేజ్ ను పోస్ట్ చేసింది. ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో సభ్యురాలయిన డానియెల్లీ ఇప్పుడు యాషెస్ కు సిద్ధమవుతోంది. దానికోసమే విరాట్ బ్యాట్ తో శిక్షణ కార్యక్రమంలో పాల్గొననుంది.
మరిన్ని వార్తలు: