కామినేని చూపు బాబు వైపు !

Ex minister kamineni srinivas likely to join tdp

మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారనే వార్తలు గతకొంత కాలంగా సోషల్ మీడియాలో వస్తున్న సంగతి తెల్సిందే. అయితే సోషల్ మీడియాలో ఇలాంటే వార్తలు కోకొల్లలుగా వస్తుండడంతో ఆ విషయానికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు, కానే నేడు ఈ వార్తలకు ఆధ్యం పోసినట్టు స్వయంగా ఆయనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని నేను సచివాలయానికి వచ్చి మరీ కలిశారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ సమన్వయంతో ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి విదితమే. ఎన్నికల అనంతరం బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ (వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి), మాణిక్యాల రావు (దేవదాయ శాఖ మంత్రి) చంద్రబాబు మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు.

kamineni srinivas

అయితే అనుకోని పరిణామాలతో నాలుగేళ్లకు బీజేపీ నుంచి టీడీపీ దూరమైంది. అంతేకాకుండా కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తమ పదివికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కామినేని శ్రీనివాస్,మాణిక్యాలరావు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అయితే కామినేని కి మొదటినుంచి చంద్రబాబు ప్రాముఖ్యతనిస్తూ వచ్చారు. ముఖ్యమైన నిర్ణయాల్లో, సమావేశాల్లో చంద్రబాబుకి వెన్నంటి ఉండేవారు. అయితే మంత్రి పదవికి దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. బీజేపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.దీంతో ఆయన టీడీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికలు కూడా దగ్గర పడనున్న నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ అవ్వటం చర్చనీయాంశం అయింది.

chandrababu

చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఆయన పార్టీలో చేరటానికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తుంది.ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలిసిందే. గత ఎన్నికల్లో సమాధి అయిపోయిన కాంగ్రెస్ పార్టీని మించి జనాగ్రహాన్ని ఆ పార్టీ ఇప్పుడు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ కి అక్కడక్కడా ఒకటి రెండు ఓట్లు అయిన వచ్చాయి. బీజేపీకి అయితే ఆ ఒకటి రెండు ఓట్లు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అంతెందుకు నుంచోబెట్టడానికి క్యాందిదేట్లు దొరకని పరిస్థితి ఇలాంటి దుస్థితిలో ఉన్న పార్టీలో ఉండడం కంటే ప్రత్యామ్నాయం చేయూకోవడం ఉత్తమమని కామినేని బలంగా భావిస్తున్నట్లే వుంది. ఒకవైపు బీజేపీ మా శత్రువు మరోసారి మోడీ ప్రధాని కాకుండా అడ్డుకుంటామని చంద్రబాబునేషనల్ స్తాయిలో కూటమి కూడా కట్టారు. దీంతో ఆయన కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు అర్ధమవుతోంది. నిజానికి కామినేని శ్రీనివాస్ కరుడుగట్టిన బీజేపీ నేతేమీ కాదు.

కామినేని చూపు బాబు వైపు ! - Telugu Bullet

2014 ఎన్నికల సమయంలో టీడీపీలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ బీజేపీతో పొత్తు ఉండడంతో ఆ పార్టీలోకి వెళ్లి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబే ఆయనకు సలహా ఇచ్చారని చెబుతుంటారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా గెలవగా వెంకయ్యనాయుడు సిఫార్సు చేయగా చంద్రబాబు ఏరికోరి మంత్రిగా నియమించుకున్నారు. కానీ బీజేపీ- టీడీపీ మధ్య పొత్తు తెగిపోవడంతో అయిష్టంగానే మంత్రి పదవికి కామినేని రాజీనామా చేశారు. ఇప్పుడు ఎన్నికలు తిరిగి దగ్గర పడుతుండడంతో ఇలా టీడీపీకి దగ్గరవుతున్నట్టు భావిస్తున్నారు. ఒక్క కామినేని మాత్రమే కాదని బీజేపీలో మరికొందరు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ చలవతోనే వారంతా ఎమ్యెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత మరి కొందరు టీడీపీ దయతో ఎమ్మెల్సీలూ అయ్యారు.