పార్దీ గ్యాంగులంటూ వదంతులు…కృష్ణా పోలీస్ అలెర్ట్ !

fake news about Parthi gang circulating in krishna district

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

పార్థి గ్యాంగ్ అని, పిల్లలను ఎత్తుకొని పోయే గ్యాంగ్ అని చిన్నపిల్ల్ని అపహరించి.. వారిని దారుణంగా హత్య చేస్తున్నట్లుగా ఇటీవల వాట్సాప్ లో వస్తున్న సందేశం సంచలనంగా మారింది. చిన్నారుల మెదళ్లను తినేసే అత్యంత దారుణమైన.. కరకు దొంగలు కొందరు ఇళ్లను టార్గెట్ చేయటం.. సొత్తును చోరీ చేసి.. మనుషులపై దాడికి పాల్పడుతున్నారని.. ప్రాణాలు తీస్తున్నట్లుగా వాట్సాప్ లలో ఫేక్ మెసేజ్ లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లాలో ఎక్కువ అయినట్లుగా సమాచారం. దీంతో అసలు లేని పార్దీ గ్యాంగ్ నుంచి తమ వాళ్లను కాపాడుకునేందుకు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల ప్రజలు భయాందోళనలతో నిద్ర పోని పరిస్థితి. రాత్రివేళలో ఎప్పుడు ఎవరొచ్చి దాడికి దిగుతారోనన్న ఆలోచనతో గ్రామాల్లోని యువకులు కర్రలు పట్టుకొని పహరా కాస్తున్నారు. వాట్సాప్ వదంతులతో భయపడుతున్న పలు గ్రామాల వారు.. తమ గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ.. పోలీసులకు అప్పగిస్తున్నారు.

బంధువులు అదే పనిగా ఫోన్లు చేసి.. మీరు.. మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటూ ఫోన్లు చేస్తున్న వైనం మరింత మనో వ్యధకు గురి చేస్తోంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం కృష్ణా జిల్లా వాసుల్ని వణికిస్తోంది. అయితే.. వాట్సాప్ గ్రూపుల్లో సాగుతున్న ప్రచారంలో నిజం లేదని.. భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నా వారు నమ్మని ఎవరి నమ్మని పరిస్థితి నెలకొంది. అయితే ఇలా పార్థి గ్యాంగ్ అని, పిల్లలను ఎత్తుకొని పోయే గ్యాంగ్ అని రక రకాలుగా వదంతులు సృష్టిస్తూ కొంత మంది అమాయక ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని కానీ రాష్ట్రము మొత్తం మీద ఎక్కడా అలాంటి వారు సంచరిoచడము లేదని ఇలా అనవసర వదంతులు వ్యాప్తి చేసిన వారిపై IT Act మేరకు కేసులు కూడా పెట్టి రిమాండ్ విధించడం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. తమకు వచ్చిన ప్రతి చెత్త మెసేజ్ ను ఫార్వర్డ్ చేస్తే ,రేపు ఆ మెసేజ్ వలన ఎవరి మాన ప్రాణాలకు హాని కలిగిస్తే,ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసిన వారి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తునారు.