యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఫ్యామిలీ స్టార్. దీనిని గ్రాండ్ లెవెల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

విషయం ఏమిటంటే, నేటితో తమ సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయిందని హీరో విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా లో అకౌంట్స్ ద్వారా ఒక చిన్న వీడియో బైట్ రిలీజ్ చేస్తూ తెలిపారు. కాగా ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకుని తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్నది .
Anddd – It’s a wrap
#Familystar will See you all in Cinemas – April 5th!
We are all buzzing with Excitement
pic.twitter.com/eHyoOSaFO7
— Vijay Deverakonda (@TheDeverakonda) March 16, 2024