Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జై లవకుశ’ టీజర్ వచ్చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడనే విషయం తెల్సిందే. మూడు పాత్రలకు గాను మూడు టీజర్లను విడుదల చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నేడు జై పాత్ర టీజర్‌ను విడుదల చేశాడు. టీజర్ చూస్తుంటే జై పాత్ర ఎన్టీఆర్ నెగటివ్ రోల్ అనిపిస్తుంది. రావణాసూరిడికి దండం పెట్టడంతో పాటు ఆ మొహ కవలికలు మరియు బాడీ లాంగ్వేజ్‌ను చూస్తుంటే మరోసారి ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపడం ఖాయంగా కనిపిస్తుంది.
ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆ రావణాసూరిడిని చంపాలంటే సముద్రం దాటాలి, ఈ రావణుడిని చంపాలంటే సముద్రమంత ధైర్యం కావాలంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ పిచ్చేకిస్తోంది. ఈ పాత్రకు కాస్త నత్తి కూడా ఉంటుందని టీజర్లోనే చూపించారు. మొత్తానికి సింగిల్ టీజర్‌తో అంచనాలను 200 రెట్లు పెంచారు. ఇక లవకుమార్, కుశకుమార్ల టీజర్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అప్పుడే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. విజులవ్స్ మరియు ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోయింది. ఎన్టీఆర్ స్థాయిని మరింతగా ఈ సినిమా పెంచడం ఖాయంగా కనిపిస్తుంది.
మరిన్ని వార్తలు