సాధారణంగా మనం సినిమాకి వెళ్ళినప్పుడు కొందరు జంటలను చూస్తూ ఉంటాం. వారికి పెళ్లి కాకపోయినా వారు చూపించుకుని ప్రేమ, అన్యోన్యత(అని వారి ఫీలింగ్) చూసి మనకు కూడా అసూయ కలుగుతూ ఉంటుంది. వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళుతుందో లేదో కానీ దానిని మనం తట్టుకోలేము.
అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళే ఉంటె, అందులో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురో కొడుకో ఉంటె ? అలాంటి పరిస్థితే ఎదురయ్యింది వరంగల్ కు చెందిన ఒక తండ్రికి. చదువుకోమని కాలేజీకి పంపిస్తే తన ప్రేమికుడితో కలిసి సినిమాకు వచ్చిందో యువతి. అదృష్టం అడ్డం తిరిగి తండ్రికె దొరికిపోగా కడుపు రగిలిపోయిన తండ్రి ఆమెను గొడ్డును బాదినట్టు చితకబాదాడు.
ఈ ఘటన వరంగల్ లోజరిగింది. అసలే రాఖీ పండగ పైగా సండే కావడంతో ప్రేమికులిద్దరు సరదాగా వరంగల్ లోని s2 సినిమా హాల్ కు వచ్చారు. టికెట్ తీసుకుని సినిమా హాల్లోకి వెళ్లారు. అయితే అంతలోనే సీన్ కాస్త రివర్స్ అయింది. కాకతాళియమో, యాదృచ్ఛికమో గానీ అదే సినిమాకు యువతి తండ్రి కూడా వచ్చి హాల్లో వారి వెనక సీట్లోనే కూర్చున్నాడు. అయితే ముందు కూర్చున్న జంట ప్రేమాయణం చూడలేక వారిని హెచ్చరిద్దామని ముందకు వచ్చి చూస్తే ఇంకేముంది ఆమె తన కూతురే.
ఇక అంతే తన కూతురు ప్రేమికుడితో కలిసి సినిమాకు వచ్చిందన్న కోపాన్ని తండ్రి తట్టుకోలేక పోయాడు. వెంటనే కూతురిని బయటవరకు ఈడ్చుకుంటూ వచ్చి తీవ్రంగా కొట్టాడు. చదువుకోమని పంపిస్తే లవర్ తో కలిసి సినిమాకు వస్తావా అంటూ కూతురును చావబాదాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ప్రేమికుడిని కూడా చితక్కొట్టాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.