Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Former CM Kumaraswamy wife Radhika Turns Heroine Again
రాజకీయ, సినీ రంగాన్ని కుదిపేస్తున్న అంశం ఇది. ఓ మాజీ ప్రధాని కోడలు, మాజీ సీఎం భార్య చిత్ర రంగ ప్రవేశం చేస్తున్నారన్న వార్త కన్నడ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ సంచలనానికి కేంద్రబిందువు రాధికా కుమారస్వామి. మాజీ సీఎం కుమారస్వామిని రెండో పెళ్లి చేసుకుని చిత్రసీమకు సురమైన నటి రాధికా ఓ బిడ్డకి తల్లి కూడా అయ్యారు. ఇప్పుడు కుమారస్వామితో విభేదాలు వచ్చి తిరిగి సినిమా రంగంలోకి రావడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బయటకు వచ్చిన వార్త గురించి కన్నడనాట అంతులేని చర్చ సాగుతోంది.
రాధిక కన్నడ సినీ రంగంలో హీరోయిన్ గా బాగా రాణించారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం చుట్టూ తిరుగుతూనే వుంది. సినిమాల్లో బిజీగా వున్నప్పుడే రాధికా పెళ్లి రతన్ కుమార్ అనే అతనితో జరిగిపోయింది. అయితే ఆ పెళ్లి మీద రాధికా తల్లితండ్రులు అభ్యంతరం తెలిపారు. మైనారిటీ తీరని తమ కుమార్తెను రతన్ బెదిరించి పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. ఆ వివాదం ఓ కొలిక్కి రాకముందే రాధికని పెళ్లి చేసుకున్న రతన్ కుమార్ 2002 లో గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత నాలుగేళ్లకు కుమారస్వామితో తనకు పెళ్లి జరిగినట్టు రాధికా ప్రకటించారు. ఇది ఆయనకు కూడా రెండో పెళ్లి. అప్పటికే పెళ్ళైన కుమారస్వామి సినిమా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నప్పుడు రాధిక తో పరిచయం అయ్యింది. అది ప్రేమగా, పెళ్లిగా మారింది. ఆ ఇద్దరికీ ఓ కుమార్తె పుట్టింది.
కుమారస్వామి మొదటి భార్య ఒత్తిడి తో ఇటీవల రాధికని దూరం పెడుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఇంతలోనే రాధికా సినీ రంగ పునః ప్రవేశం గురించి బయటికి తెలియడంతో ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది. ఇప్పుడు కన్నడ నటుడు, దర్శకుడు రవిచంద్రన్ సినిమాలో యాక్ట్ చేయడానికి రాధిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో రాధిక, కుమారస్వామి మధ్య విబేధాల గురించి కన్నడనాట విస్తృతంగా చర్చ సాగుతోంది.
మరిన్ని వార్తలు:
అప్పుడు బైబిల్…ఇప్పుడు అమ్మవారి అక్షింతలు.