Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Nda నుంచి వెళ్ళిపోయి టీడీపీ తప్పు చేసిందంటూ ఏపీ బీజేపీ నేతలతో పాటు జాతీయ స్థాయి నాయకులూ మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ నాయకులు ఈ మాట అనే ముందు కాస్త ఆత్మ శోధన చేసుకుంటే మేలు. ఇదే బీజేపీ ని, ప్రధాని మోడీని నమ్మి 2014 కి ముందు ఎంత మంది వున్నారో, ఇప్పుడు ఎంత మంది చూస్తే చాలు. 2014 ఎన్నికలకు ముందు మోడీతో కలిసి nda లో పనిచేయడానికి దాదాపు 50 పార్టీలు ఆలోచించాయి. చివరకు 46 పార్టీలు బీజేపీ తో కలిసి నడిచాయి. కానీ ఎన్నికల తరువాత ఆ భ్రమల తెరలు తొలిగిపోయాయి. మోడీ పాలనతో పాటు అమిత్ షా ఆధ్వర్యంలో ఆ పార్టీ చేస్తున్న రాజకీయం చూసి చాలా పార్టీలు బీజేపీ నుంచి దూరం జరిగాయి. బీజేపీ కి సైద్ధాంతికంగా కూడా ఎంతో దగ్గరగా వుండే శివసేన సైతం ఆ పార్టీ వైఖరి భరించలేకపోయింది. అందరికన్నా ముందుగా ఆ పార్టీ పత్రిక సామ్నాలో బీజేపీ ని ఉతికి ఆరేయడం మొదలెట్టింది.
శివసేన మాత్రమే కాదు మోడీ, అమిత్ షా నిజస్వరూపం బయటపడేకొద్దీ ఒక్కో పార్టీ దూరం జరుగుతూ వచ్చాయి. తాజాగా టీడీపీ బయటకు రావడం అందులో ఓ భాగం మాత్రమే. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ తో ఎన్నికల పొత్తు కొనసాగించడానికి కేవలం నాలుగంటే నాలుగు పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఆ నాలుగు పార్టీలు కూడా వుంటాయో, ఉడతాయో తెలియని పరిస్థితి. ఇదంతా తెలిసి కూడా టీడీపీ ని తప్పుబడుతున్న బీజేపీ నాయకులని, వారి అహంభావాన్ని చూస్తుంటే జాలి కలుగుతోంది.