ఒకే రోజు.. 10 సినిమాలు.. !

friday 10 movie release

చిన్నవో.. పెద్ద‌వో.. ఒక్క రోజు 10 సినిమాలు రావ‌డం మాత్రం అరుదైన విష‌య‌మే. రానున్న శుక్రవారం ఆ విచిత్రం జ‌ర‌గ‌బోతుంది. ఒకేరోజు ఏకంగా ప‌ది సినిమాలు రానున్నాయి. అందులో క‌నీసం ఒక్క‌టి కూడా స్టార్ హీరో సినిమా అయితే లేదు. ఆ రోజే ఏకంగా 7 స్ట్రెయిట్ సినిమాలు.. మూడు డ‌బ్బింగ్ లు రానున్నాయి. ఎంతోకాలంగా విడుద‌ల‌కు నోచుకోని సినిమాల‌ను కూడా ఆరోజునే విడుద‌ల చేస్తున్నారు. వీటితోపాటు, చంద్ర సిద్ధార్థ్ ‘ఆటగదారా శివా’, ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రాలు విడుదలకు రెడీ అయినా, సినిమాల తాకిడి దృష్ట్యా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయి.
స్ట్రెయిట్ సినిమాల సంగ‌తికి వ‌స్తే..
1. శంభో శంకరా.. (శకలక శంకర్)
కమెడియన్ షకలక శంకర్ ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన సినిమా శంభో శంకర. శ్రీధర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో షకలక శంకర్ కామెడీ చేస్తూనే, యాక్షన్ హీరోగా ఇంప్రెస్ చేయనున్నట్టు తెలుస్తుంది.
2. ఈ నగరానికి ఏమైంది? (తరుణ్ భాస్కర్ డైరెక్షన్)
‘పెళ్ళి చూపులు’ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ రెండో సినిమా ఇది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.
3. కన్నులోని రూపమే
నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటించిన యూత్ ఫుల్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ ఈ సినిమా. ఈ సినిమాతో బిక్స్ ఇరుసాడ్ల డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.
4. IPC సెక్షన్
ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ని బేస్ చేసుకుని తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘IPC సెక్షన్ భార్యబంధు’. ‘సేవ్ మెన్ ఫ్రమ్ విమెన్’ అనే డిఫెరెంట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే రిలీజవుతుంది.
5. మిస్టర్ హోమానంద్
ఓం తీర్థాన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘హోమానంద్’. జై రామ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుందో ఈ ఫ్రైడే తెలుస్తుంది.
6. నా లవ్ స్టోరీ
మహిధర్, సోనాక్షి జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ నా లవ్ స్టోరీ. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి వేదం నివాస్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. శివ గంగాధర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి లక్ష్మి ప్రొడ్యూసర్.
7. యుద్ధ భూమి
1971 లో భారత సరిహద్దుల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కింది అల్లు శిరీష్ ‘యుద్ధభూమి’. లాస్ట్ ఇయర్ మలయాళంలో రిలీజై సూపర్ హిట్టయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో గ్రాండ్ గా రిలీజవుతుంది. మేజర్ రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.
8. సూపర్ స్కెచ్
మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ‘సూపర్ స్కెచ్’. గతంలో ‘సామాన్యుడు’, ‘శ్రీమన్నారాయణ’ సినిమాలకు దర్శకత్వం వహించిన కమర్షియల్ డైరెక్టర్ రవి చావలి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. నర్సింగ్, ఇంద్ర, అనిక ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తారు.
9. ఎస్కేప్ 2
10. సంజీవని
ట్రైలర్ ని బట్టి ఇంటెన్సివ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. భారీ VFX తో తెరకెక్కిన ఈ సినిమాలో అనురాగ్ దేవ్, మనోజ్ చంద్ర మరియు శ్వేత వర్మ హీరోయిన్స్ గా నటించారు. ఈ ఫ్రైడే రిలీజవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకి రవి డైరెక్టర్.