‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశిఖన్నా ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. అయితే ఈమెకు మంచి బ్రేక్ మాత్రం దక్కడం లేదు. ఈ సమయంలోనే ఈమె వద్దకు నిర్మాత దిల్‌రాజు ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం స్క్రిప్ట్‌తో వెళ్లడం జరిగింది. ఆ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో పారితోషికం విషయంలో కాస్త తగ్గి మరీ సినిమాకు ఓకే చెప్పింది. తన గత చిత్రాల కంటే దాదాపు 25 శాతం పారితోషికం తగ్గించుకుని మరీ రాశిఖన్నా ఈ చిత్రంలో నటించింది అంటూ స్వయంగా దిల్‌రాజు చెప్పుకొచ్చాడు. ఆమెకు కథ నచ్చడం వల్లే ఇంతటి నిర్ణయం తీసుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రాశిఖన్నా అంచనా తారుమారు అయ్యింది. శ్రీనివాస కళ్యాణం చిత్రం ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఇదే సమయంలో మరో తప్పుడు నిర్ణయానికి రాశిఖన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
విజయ్ దేవరకొండతో ఒక చిత్రాన్ని చేయాలని పరుశురామ్ ప్రయత్నాలు చేస్తూ, హీరోయిన్ పాత్ర కోసం రాశిఖన్నాను అడగడం జరిగిందట. అప్పటికి విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ విడుదల కాలేదు. దాంతో చిన్న హీరోతో సినిమా చేయాలి అంటే కోటి రూపాయలు పారితోషికం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేసిందట. మంచి కథ అంటూ చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించినా కూడా రాశిఖన్నా మాత్రం కోటి ఇస్తేనే కథ వింటాను అంటూ తెగేసి చెప్పిందట. ఇప్పుడు ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీత గోవిందం చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యింది. రాశిఖన్నా మాత్రమే కాకుండా దాదాపు 25 మంది హీరోయిన్స్ గీత పాత్రకు నో చెప్పారు అంటూ దర్శకుడు పరుశురామ్ చెబుతున్నాడు. వారంత కూడా ఇప్పుడు అబ్బా అనుకుంటూ ఉంటారు. అందుకే ఎవరిని, ఏ కథను తక్కువ అంచనా వేయవద్దు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.