‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో యూత్ ఐకాన్‌గా మారిపోయిన విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘గీత గోవిందం’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు, పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. తాజాగా టీజర్‌ను విడుద చేయడం జరిగింది. ఆగస్టు 15న విడుదల చేసేందుకు సిద్దం అవుతున్న ఈ చిత్రం కథ నాది అని, తనకు చెప్పకుండా, అనుమతి లేకుండా కాపీ చేశారు అంటూ ఒక రచయిత మీడియా ముందుకు వచ్చాడు. గీత గోవిందం సినిమా విడుదలను అడ్డుకుంటాను అంటూ హడావుడి చేస్తున్నాడు. కొన్ని సినిమాలకు ఇలాంటివి కామన్‌గా వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సార్లు మాత్రం ఈ చిన్న విషయాలు పెద్దగా అవుతూ ఉంటాయి.
‘గీత గోవిందం’ చిత్రం టీజర్ విడుదలైన తర్వాత సినిమా కథపై క్లారిటీ వచ్చింది. ఒక వర్జిన్ కుర్రాడు అమ్మాయిలు కనిపిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, ఆంటీలతో ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కథ అనిపిస్తుంది. ఇదే కథను రచయిత నివాస్ రెడీ చేసుకున్నాడట. ‘వర్జిన్’ అనే టైటిల్‌తో సినిమాను తీయాలని భావిస్తున్న సమయంలో ఈ చిత్రాన్ని చేస్తున్నారు అని, తన కథను ఛాంబర్లో రిజిస్ట్రర్ చేయించాను, అయినా కూడా తన కథతో సంబంధం ఉందని పట్టించుకోకుండా అనుమతించడం జరిగిందని నివాస్ ఆరోపిస్తున్నాడు. గీతాగోవిందం చిత్రం విడుదలకు ముందే తనకు న్యాయం చేయాలని, లేదంటే సినిమాను అడ్డుకుంటాను అంటూ హెచ్చరిస్తున్నాడు. మరి ఈ వివాదాన్ని అల్లు అరవింద్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.