Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారీ అంచనాల నడుమ మొదలైన బిగ్‌బాస్ సీజన్ 2 కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్లుగా సాగుతుంది. మొదటి సీజన్‌తో పోల్చితే రెండవ సీజన్ కాస్త డల్‌గా ప్రారంభం అయ్యిందని చెప్పుకోవచ్చు. రెండవ సీజన్‌లో సెలబ్రెటీలు ఎక్కువగా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ పడుతున్నారు. నోటెడ్ సెబ్రెటీలు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారిలో ముందు సింగర్ గీతామాధురి నిలుస్తుంది. బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం ఉన్న మొత్తం 16 మందిలో గీతామాధురికి ఎక్కువగా ప్రేక్షకుల గుర్తింపు మరియు ఆధరణ ఉందనడంలో అతిశయోక్తి లేదు. బిగ్‌బాస్ హౌస్‌లో గీతామాధురి ఉండటంతో ఆ సందడి వేరు అంటూ ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక అందరి కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న గీతామాధురి అందరి కంటే ఎక్కువ పారితోషికం కూడా తీసుకుంటున్నట్లుగా మా వర్గాల వారు చెబుతున్నారు.
గీతామాధురికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. స్టేజ్ షో చేసినా మరేం చేసినా కూడా గీతామాధురికి మంచి పారితోషికం దక్కుతుంది. ఈ 100 రోజుల్లో ఆమె కనీసం 15 నుండి 20 స్టేజ్ షోలు చేసినా, పాటలు పాడినా కూడా ఆమెకు ఖచ్చితంగా 20 లక్షలకు కాస్త అటు ఇటుగా పారితోషికం రావడం ఖాయం. అలాంటప్పుడు గీతా ఎందుకు హౌస్‌లోకి వెళ్లింది అంటూ అంతా చర్చించుకుంటున్నారు. ఆమె బయట ఉండగా సంపాదించుకునే మొత్తంకు సమానంగా బిగ్‌బాస్ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడు అని, అందుకే గీతా వచ్చిందంటూ టాక్ వినిపిస్తుంది. ఈ షో కోసం గీతామాధురి 20 లక్షల పారితోషికం తీసుకుంటుంది. గీతామాధురి సునాయాసంగా 40 నుండి 50 రోజుల పాటు ఉండేస్తుంది. ఆమె ఎలిమినేట్ కాకుండా కనీసం నెల పాటు ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఒక వేళ ఆమెకున్న క్రేజ్‌ను బట్టి ఎలిమినేషన్‌లో ఉన్నా కూడా సేఫ్ అవుతుంది. అందుకే ఆమెకు హోల్‌సేల్‌గా 20 లక్షల పారితోషికం మరియు 45 రోజుల తర్వాత వారంకు రెండు లక్షల చొప్పున అదనపు పారితోషికం ఇవ్వబోతున్నారు. అంటే గీతా ఫైనల్ డే వరకు ఉంటే దాదాపు 30 లక్షలు పారితోషికంగా అందుకుంటుందన్నమాట. ఇక పైనల్ విన్నర్ అయితే 30 లక్షలు మరియు ప్రైజ్ మనీ అమౌంట్‌తో గీతా దుమ్ము దుమ్ముగా డబ్బు సంపాదించడం ఖాయం అంటున్నారు.