Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Gold Rate Increases by Rs 990 In A Single Day And Reaches to Rs 31,350
పసిడికి మళ్లీ రెక్కలొచ్చాయి. ఇవాళ ఒక్కరోజే రూ.990 ధర పెరిగింది. ఈ ఏడాదిలో ఒక్కరోజే బంగారం ధర ఇంత గరిష్టంగా పెరగటం ఇదే తొలిసారి. అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్ ఇర్మా ప్రభావంతో ధరలు భారీగా పెరగటంతో పదిగ్రాముల పసిడి ధర రూ. 31, 350కి చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్టు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ధర పెరగడంపై ఇటు కొనుగోలుదారులు, అటు షాపు యజమానులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ధర పెరుగుదల ఇలాగే కొనసాగితే బంగారు నగల అమ్మకాలు పడిపోయే అవకాశముందని భావిస్తున్నారు. నవరాత్రులు, దసరా, దీపావళి సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఆ సమయంలో ధరలు పెరిగితే కొన్నాళ్లు ఆగి చూద్దాం అన్న భావన ఏర్పడుతుంది. ఇది అమ్మకాలపై ప్రభావం చూపిస్తుందంటున్నారు గోల్డ్ షాపు నిర్వాహకులు. అటు బంగారం బాటలోనే వెండి కూడా పెరుగుదల నమోదు చేసుకుంది. కిలో వెండి రూ. 42వేలకు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని వార్తలు
-
మళ్లీ బ్రోతల్ కేసులో హీరోయిన్..!
-
ముద్దు మాత్రమే కాదు.. హద్దు దాటేందుకు సిద్దం
-
‘జై లవకుశ’ ఫుల్ క్లారిటీ వచ్చేసింది…