దివంగత నటుడు ఉదయ్ కిరణ్ మరియు అనితా హస్సానందని ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ తేజ దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ నువ్వు నేను. ఆగస్ట్ 10, 2001 న థియేటర్ల లో రిలీజ్ అయిన ఈ మూవీ , బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో హీరోయిన్లు ఇద్దరూ ఈ మూవీ తో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ఇప్పుడు, 22 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ కు రెడీ అయిపోయింది.

మార్చి 21న రీ రిలీజ్‌కు షెడ్యూల్ చేయబడింది. ఉదయ్ కిరణ్ అభిమానులకి ఇది గుడ్ న్యూస్. జనవరి 5, 2014న ఉదయ్ తన జీవితాన్ని విషాదకరంగా ముగించుకున్న సంగతి అందరికి తెలిసిందే. నువ్వు నేను 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఉదయ్ కిరణ్ మరియు దర్శకుడు తేజ, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. నిర్మాత జెమిని కిరణ్ మరియు సంగీత దర్శకుడు RP పట్నాయక్ లకు ఉత్తమ మూవీ మరియు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డులతో ఫిల్మ్ ఫేర్ సత్కరించింది. నువ్వు నేను 2002లో 5 నంది అవార్డులను కూడా గెలుచుకున్నది .