గూఢచారి ట్రైలర్ & రివ్యూ

Goodachari Movie trailer

నిజం చెప్పు అర్జున్ నువ్వు ఎవరు..? మరొక విలక్షణమయిన సినిమా విలక్షణమైన నటులతో ‘గూఢచారి’… క్షణం తరువాత అడవి శేషు నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రకాష్ రాజు, సుభిత దులిపల ఇతర ముఖ్య తారాగణంగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేస్తుంది. థ్రిల్లర్ ఫార్మట్లా కనిపిస్తున్న ఈ ట్రైలర్ సినిమా కథను చెప్పి చెప్పనట్టుగా చెప్పింది.

ఇక ట్రైలర్ గురించి మాట్లాడాలంటే, ఏదో రక్షణ భద్రతా కథాంశంలా అనిపిస్తుంది. తండ్రిని ఆదర్శంగా తీసుకొనే కొడుకు కథ అని అనుకునేలోపల, హీరోని గూఢచారిగా అనిపించేలా ట్రైలర్ ని కట్ చేశారు. ఒక యాక్షన్ థ్రిల్లర్ అనే విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పొచు. అయితే, క్షణం సినిమా రైటర్ కాబట్టి ఇది కూడా క్షణం లానే మంచి కథ అయి ఉండవచ్చు. ఏది ఏమైనా కొత్త తరహా కథలు కావలనుకున్న మనవారికి ఈ థ్రిల్లర్ నచ్చచ్చేమో. కాగా, ఈ సినిమా ఆగష్టు 3వ తారీకు రిలీజ్ చేస్తున్నారు.