మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో యువ హీరో నాగ శౌర్య కూడా ఒకరు . లవ్ అండ్ యాక్షన్ మూవీ ల్లో రాణించిన ఈ యంగ్ హీరో నటించిన లాస్ట్ మూవీ “రంగబలి” అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు. దీనితో అక్కడ నుంచి కొంచెం గ్యాప్ తీసుకొని మంచి కథలు వినడం ఆయన మొదలు పెట్టాడు. అయితే ఆ రంగబలి మూవీ దర్శకుడు పవన్ బాసంశెట్టి తోనే చేస్తాడు అని కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ ఇపుడు తన కొత్త మూవీ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
ఈసారి దర్శకుడు రమేష్ దేసినతో మూవీ ని అనౌన్స్ చేయగా ఈ మూవీ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అలాగే ఈ మూవీ ని కొత్త నిర్మాణ సంస్థ వైష్ణవి ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా తమ బ్యానర్ నుంచి మొదటి ప్రొడక్షన్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. అలాగే ఈ మూవీ కి ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందించనుండడం విశేషం. మరి నేడు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యిన ఈ మూవీ పై మరిన్ని డీటెయిల్స్ ముందు ముందు రానున్నాయి.