సినిమాటోగ్రాఫర్ గా ఫేమస్ అయిన గుహన్ కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా వచ్చిన 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ నెల 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాస్త విభిన్నంగా సాగే ఈ కథ హాలీవుడ్ సినిమాలాగా ఉండడంతో ఏదైనా హాలీవుడ్ సినిమాకి రీమేకో, ఫ్రీమేకో అయ్యుంటుందని భావించారు అందరూ, అయితే ఈ సినిమా కధ ఎలా పుట్టిందని ఒక మీడియా ప్రతినిది అదిగిన ప్రశ్నకి గుహన్ స్పందించారు.
సాధారణంగా సినిమా షూటింగులు ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయని తరచూ కొత్త ప్రదేశాలకి వెళ్లవలసి వస్తుంటుంది అక్కడి హోటల్స్ లో ఒంటరిగా నిద్రించవలసి వస్తుంది. అలా ఒక హోటల్లో ఒక్కడినే పడుకున్నప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక అమ్మాయిని చంపేశాను. దాంతో ఉలిక్కి పడి నిద్రలేచాను అంతే ఆ తరువాత నిద్రపట్టలేదు. అప్పటి నుంచి ఆ కల నన్ను వెంటాడుతూనే వుంది. దాంతో ఆ కలను కథగా మలచుకున్నాను దానిని తెరకెక్కించడానికి ఇంతకాలం పట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. నిజంగా కలని సినిమా తీసి హిట్ కొట్టడం మామోలు విషయం కాదుగా.