Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పట్నుంచో హరిబాబు ఓ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. గురువు వెంకయ్యతో కూడా చాలాసార్లు తన కోరిక విన్నవించుకుంటున్నారు. వెంకయ్య కూడా శిష్యుడి కోసం చాలా ట్రై చేశారు. కానీ వివిధ సమీకరణాల మధ్య కుదర్లేదు. ఇప్పుడు వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లారు కాబట్టి.. హరిబాబు కోరిక తీరుతుందనే మాట వినిపిస్తోంది. త్వరలో హరిబాబు కేంద్రమంత్రి కావడం ఖాయమే.
హరిబాబు అడ్డు కూడా తొలగితేనే ఏపీలో తన మార్క్ పాలిటిక్స్ నడుస్తాయని అమిత్ షా భావిస్తున్నారు. ఇలా ఎవరికి వారు వ్యూహాలు పన్నుతున్నారు. అటు హరిబాబు కూడా తన కోరిక తీరితే అంతే చాలనుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకేం జరుగుతుందనేది ఆసక్తికరమే. అదే జరిగితే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది కూడా ఆసక్తికరమే.
ఏపీలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న వెంకయ్య.. ఇప్పుడు అధ్యక్ష పదవికి కూడా ఓ వ్యక్తి పేరు సూచించారు. ఆయన మరెవరో కాదు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు. ఆయనైతే అందర్నీ కలుపుకుపోతారనే అభిప్రాయం వ్యక్తం చేసారట. వెంకయ్య ఇచ్చిన చివరి సలహాను గౌరవించాలని పార్టీ భావిస్తోంది. దీంతో ఇద్దరు బీజేపీ ఎంపీలకు ప్రమోషన్లు ఖరారైనట్లే.
మరిన్ని వార్తలు: