Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని అఖిల్ హీరో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండవ చిత్రం ‘హలో’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మినిమం కలెక్షన్స్‌ను కూడా సాధిస్తుందనే నమ్మకం లేదు. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ చిత్రం కేవలం 10 కోట్ల మార్క్‌ను మాత్రమే దాటగలిగింది. మరో వైపు నాని నటించిన ‘ఎంసీఏ’ మాత్రం మొదటి రోజే పది కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. అఖిల్ ‘హలో’ చిత్రం కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయని, లాంగ్ రన్‌లో తెలుగు రాష్ట్రాల్లో ‘హలో’ చిత్రం కనీసం 15 కోట్లు అయినా క్రాస్ అవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓవర్సీస్‌లో కూడా నాని ‘ఎంసీఏ’ స్థాయిలో హలో చిత్రం కలెక్షన్స్‌ను రాబట్టడంలో విఫలం అవుతుంది. హలో ఒక మోస్తరుగా ఉందనే టాక్ వచ్చినా కూడా మాస్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ‘ఎంసీఏ’ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిని కనబర్చుతున్నారు. ప్రస్తుతం సినిమా తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వసూళ్లను రాబడుతున్నా మరో రెండు రోజుల్లో కొత్త సినిమాలు రాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో ‘హలో’కు కలెక్షన్స్ మరింతగా తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ పరిశీకులు అంటున్నారు. అల్లు శిరీష్ ఒక్క క్షణం చిత్రంతో పాటు సునీల్ 2 కంట్రీస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ టాక్ తెచ్చుకుంటే హలో చిత్రం కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవ్వడం ఖాయం. కనీసం అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’కు వచ్చిన కలెక్షన్స్ కూడా ‘హలో’కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాత నాగార్జున కూడా భారీ నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.