మన ఎంపీలు ఈ స్థితిలో ఉన్నారా..?

hema-malini-shocking-question-to-media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సామాన్యులు కూడా ఓటేసే ముందు బరిలో ఉన్న అభ్యర్థులెవరు, వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటని ఆరా తీస్తారు. తర్వాత జాగ్రత్తగా బేరీజు వేసుకుని ఓటేస్తారు. కానీ మన ఎంపీలు మాత్రం గుడ్డిగా ఓటేస్తున్నారు. ఈ విషయం హేమమాలిని ఎపిసోడ్ తో స్పష్టమైపోయింది. ఆమెకు ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తెలియకపోవడం కామెడీగా మారింది.

హేమమాలినితో మాట్లాడుతున్న మీడియా.. గోపాలకృష్ణ గాంధీ రావడంతో.. ఆయన వెంటపడింది. కానీ హేమకు మాత్రం విషయం అర్థం కాలేదు. తనను వదిలేసి అతని వెనుక ఎందుకు పడుతున్నారని అనుమానమొచ్చింది. ఎవరాయన అని మీడియావాళ్లనే అడిగి విషయం తెలుసుకుందట హేమమాలిని.

యూపీ నుంచి ఎంపీగా ఉన్న హేమమాలిని నాలెడ్జే ఇలా ఉంటే.. ఇక మిగతా ఎంపీల విజ్ఞానం ఇంకెలా ఉందోనని మోడీకి, అమిత్ షా కు ఆందోళన మొదలైంది. ఎవరో తెలియకపోతే.. పార్టీ నేతల్ని అడగాలి కానీ.. మీడియాను అడగటమేంటని హేమకు క్లాస్ పీకారట.

మరిన్ని వార్తలు:

టీకాంగ్రెస్ లో రెడ్డి వర్సెస్ బీసీ

మూడు ముక్కలాటకు అంతమెప్పుడు..?

కవిత మెగా ముమెంట్