యంగ్ హీరో నాని వరుసగా విజయాలు దక్కించుకుంటూ రెండు సంవత్సరాల పాటు జయకేతనం ఎగరేస్తూ దూసుకు పోయాడు. అలాంటి సమయంలో నాగార్జున తో కలిసి శ్రీరామ్ ఆధిత్య దర్శకత్వంలో వైజయంతి బ్యానర్‌లో ‘దేవదాస్’ అనే మల్టీస్టారర్ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘దేవదాస్’ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. చాలా సినిమాల తర్వాత నానికి దేవదాస్ చిత్రం ఫ్లాప్‌ను తెచ్చి పెట్టింది. ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో పాటు, నాని కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా పేరు తెచ్చుకుంది. దాదాపు 35 కోట్లకు అమ్ముడు పోయిన దేవదాస్ చిత్రం కేవలం 20 కోట్లు మాత్రమే వసూళ్లు చేయడంతో 15 కోట్ల మేరకు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. నాని కెరీర్‌లో డిస్ట్రిబ్యూటర్లు ఇంత భారీగా నష్టపోవడం ఇదే.
దేవదాస్ ఫ్లాప్ నేపథ్యంలో నాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తాను చేస్తున్న ప్రతి సినిమా స్క్రిప్ట్‌లో మరోసారి మార్పులు చేర్పులు చేయిస్తున్నాడు. మరో వైపు మల్టీస్టారర్ చిత్రాల జోలికి వెళ్లవద్దని కఠినంగా నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే మల్టీస్టారర్ స్క్రిప్ట్‌లను వద్దని పక్కకు పంపిచేస్తున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా ఒక యువ దర్శకుడు మల్టీస్టారర్ స్క్రిప్ట్‌తో నాని వద్దకు వెళ్లడం జరిగందట. ఆ స్క్రిప్ట్‌ను నిర్మొహమాటంగా నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మల్టీస్టారర్ చిత్రాలు చేసే ఆసక్తి తనకు లేదని, ఇప్పటికే జరిగిన నష్టం చాలు అంటూ నాని ఆ దర్శకుడితో అన్నట్లుగా తెలుస్తోంది. నాని ఇకపై మల్టీస్టారర్ చిత్రాలు చేయకపోవడంతో పాటు, కొత్త దర్శకులతో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓకే చేయాలని భావిస్తున్నాడు.
ప్రస్తుతం నాని కొత్త దర్శకుడు గౌతమ్ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఆ సినిమా ఫస్ట్‌లుక్ ను కూడా విడుదలకు సిద్దం చేస్తున్నారు. మరో వైపు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ రెండు సినిమాలు కూడా కొత్త తరహా కథనంతో తెరకెక్కబోతుంది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.