వెంకటేష్‌ కూతురు వివాహ ముహర్తం ఫిక్స్‌

Hero Venkatesh Daughter Ashritha Daggubati Marriage

విక్టరి వెంకటేష్‌ కూతురు ఆశ్రిత పెళ్లి జరుగబోతుంది అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఆశ్రిత తన చిన్ననాటి స్నేహితుడుని పెళ్లి చేసుకోబోతుంది. హైద్రాబాద్‌ రేస్‌ క్లబ్‌ చైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడితో ఆశ్రిత పెళ్లి జరుగబోతుంది. సురేందర్‌ రెడ్డి కుమారడు రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌కు దగ్గరి స్నేహితుడు. దాంతో వీరి పెళ్లికి సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు హాజరుకాబోతున్నారు. తాజాగా ఇరు కుటుంబ పెద్దలు నవంబర్‌ 24న ముహర్తం ఫిక్స్‌ చేసుకున్నారు. సమయం తక్కువ ఉండడంతో ఇరు కుటుంబాల్లో ఇప్పటికే హడావుడి మొదలైంది. పెళ్లి పనులను సాంప్రదాయబద్దంగా షురూ చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రముఖులు హాజరుకాబోతున్న ఈ వివాహానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి.

venkey-daughter-marriage

వెంకటేష్‌ కుమార్తె ఆశ్రిత ప్రొఫెషనల్‌ బేకర్‌. ఈమె ప్రస్తుతం ఒక బేకరీ కూడా రన్‌ చేస్తోంది. తన చిన్ననాటి స్నేహితుడితో స్నేహం కొనసాగించి దాన్నే ప్రేమగా మార్చుకున్న ఆశ్రిత ఆ తర్వాత ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పంచి ఈ పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరు చాలాకాలంగా ఇష్ట పడుతున్నారు కాబట్టి ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో చాలా సంతోషంగా ఉందని ఆశ్రిత స్నేహితులతో చెబుతూ తెగ మురిసిపోతుందని ఈమె సన్నిహితులు చెబుతున్నారు.

venkatesh-daughter