నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో హీరోయిన్గా అను ఎమాన్యూల్ నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంపై అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. ఈ చిత్రం సక్సెస్ అయితే తప్ప అను ఎమాన్యూల్ కెరీర్ ముందుకు సాగదు. ఇప్పటికే విడుదలైన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అను ఎమాన్యూల్‌కు వచ్చిన ఛాన్స్‌లు కూడా పోతున్నాయి. అందుకే ఈ చిత్రంపై అను చాలా ఆశలు పెట్టుకుంది. తాజాగా అను ఎమాన్యూల్ ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవ్వడంతో అను అయ్యో అనుకుంటుంది.
ఇంతకు అను ఏమని వ్యాఖ్యలు చేసింది అంటే.. తాను అమెరికాలో పుట్టడం వల్ల ఇండియన్ అమ్మాయిలకు చాలా విభిన్నంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. నేను నడిచే విధానం, కూర్చునే విధానం కాస్త విభిన్నంగా ఉంటుందని, పచ్చిగా చెప్పాలంటే మాత్రం నేను హాట్‌గా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. అమెరికా అలవాట్ల కారణంగా తన బాడీ లాంగ్వేజ్ విభిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. హాట్‌గా తన బాడీలాంగ్వేజ్ ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు. ఇండియన్ అమ్మాయిల తరహాలో తాను మారేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.