Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆమద్య హీరోయిన్ కాజల్ తాను కోరిక పారితోషికం ఇవ్వనందుకు స్టార్ హీరో చిత్రాన్ని వదిలేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను వదిలేసుకున్న తర్వాత కాజల్‌కు ఆమె కోరిన పారితోషికంతో పలు ఆఫర్లు వచ్చాయి. అయితే క్రేజ్ ఉన్నప్పుడు పారితోషికం అధికంగా డిమాండ్ చేస్తూ సినిమాలు చేయడం చాలా సహజం. అయితే భారీ పారితోషికం ఇస్తామన్నా కూడా క్రేజ్ లేనప్పుడు తాను ఆ పాత్ర చేయను అని చెప్పడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కాజల్ ఆ కోవకు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాజల్ తాజాగా తన వద్దకు వచ్చిన రెండు కోట్ల ఆఫర్‌ను తిరష్కరించినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
తెలుగు మరియు తమిళంలో కాజల్‌కు భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని దర్శకుడు పి వాసు ఒక భారీ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని ఈమెతో చేయాలని భావించాడు. అందుకు స్క్రిప్ట్ కూడా సిద్దం అయ్యింది. మొదట నయనతారను అనుకున్నా కూడా ఆమె దాదాపు అయిదు కోట్ల పారితోషికంను డిమాండ్ చేసిందట. దాంతో ఆ ఆఫర్‌ను కాజల్ వద్దకు దర్శకుడు వాసు తీసుకు వచ్చాడు. కాజల్‌కు రెండు కోట్ల పారితోషికం లేదా అంతకంటే ఎక్కువే ఆఫర్ చేయడం జరిగింది. కాని కాజల్ మాత్రం తాను హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలను చేయలేను అంటూ తేల్చి చెప్పింది. తాను ఎప్పుడు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని చేయాలని కోరుకోవడం లేదని, అలాంటి పాత్రలు చేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లే అని కాజల్ భావిస్తుంది. అందుకే కెరీర్ చివరి వరకు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలను చేయబోను అంటూ తేల్చి చెప్పింది.