భారత్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. లంక సారథి దిముత్ కరుణరత్నె(10: 17 బంతుల్లో 2ఫోర్లు)ను స్పీడ్‌స్టర్ బుమ్రా పెవిలియన్ పంపాడు. నాలుగో ఓవర్లో బుమ్రా వేసిన నాలుగో బంతిని షాట్ ఆడబోగా బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ ధోనీ చేతిలో పడింది. కరుణరత్నె వికెట్‌తో వన్డే క్రికెట్లో బుమ్రా 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
భారత్ తరఫున షమీ ఈ ఫీట్‌ను 56 ఇన్నింగ్స్‌లో అందుకోగా.. బుమ్రా 57, ఇర్ఫార్ పఠాన్ 59, జహీర్ ఖాన్ 65, అజిత్ అగార్కర్ 67, జవగళ్ శ్రీనాథ్ 68 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును అందుకున్నారు. తొలి ఓవర్ నుంచే భారత్ బౌలర్లు ధాటిగా బంతులేస్తూ ప్రత్యర్థిని హడలెత్తించారు. నాలుగో ఓవర్లోనే ఓపెనర్ ఔటవడంతో లంకపై ఒత్తిడి పెరిగింది. 7 ఓవర్లు ముగిసేసరికి లంక వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. ఆవిష్క ఫెర్నాండో(10), కుశాల్ పెరీరా(18) క్రీజులో ఉన్నారు.