గత కొద్దిరోజుల క్రితం తెలంగాణా సర్కారు పబ్లిసిటీ కోసం ఒకే మహిళను ఇద్దరికీ భార్యగా చిత్రీకరిస్తూ కొన్ని ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బాడిత మహిళ మీడియా ముందుకు వచ్చింది తన అనుమతి లేకుండా, తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల్లో తన భర్తగా వేరొకరిని చూపడాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయికి చెందిన మహిళ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ సర్కారు పేపర్లలో ప్రకటనలు ఇచ్చిన వేళ, కొన్ని ప్రకటనల్లో పద్మ భర్తగా ఒకరిని, మరికొన్ని ప్రకటనల్లో భర్తగా ఇంకొకరిని చూపించారు.
అయితే కోదాడ మండలం తొగ్రాయికి చెందిన పదమ తన భర్త ఫొటోను మార్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం యాదగిరి సమీపంలోని కొంగవల్లిలో ఉంటున్న తమ వద్దకు వచ్చి మూడు సంవత్సరాల క్రితం కొందరు వచ్చి కుట్టు మిషన్ లకి లోనులు ఇప్పస్తామని ఫొటోలు తీసుకున్నారని ఆమె చెబుతోంది. అయితే ఆ ఫోటోలు తీసుకున్నప్పటి నుండి తమకు రోజూ ఎదో ఒక అవమానం ఎదురవుతూనే ఉందని అసలు పొలమే లేని తమకు రైతుబందు పధకం కింద డబ్బులోచ్చాయని రూ. 4 వేలు ప్రభుత్వం నుంచి అందుకుని ఆనందంగా ఉన్నామని , ఆపై తాము కాపుసారా కాచుకుని, దాన్ని తాగేవాళ్లమని, ఇప్పుడు సారా కాయడం లేదని, ఆనందంగా ఉన్నామని చెబుతూ పేపర్లో ప్రకటన ఇచ్చారని తెలిపింది.
కంటివెలుగు ప్రారంభం సమయంలో తన భర్త ఫొటో బదులు వేరొకరి ఫొటో పెట్టారని ఆమె ఆరోపించింది. దాన్ని చూసిన తమ ఇంటిలో రోజూ గొడవలు అవుతున్నాయని రోడ్డు మీద అయితే అసలు తాను తలెత్తుకు తిరగలేకపోతున్నానని వాపోయింది. ఈ విషయంలో అసలు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆ మహిళ పేర్కొంది. అయితే ఈ విషయం మీద తీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.