‘జై లవకుశ’.. ఇదో రొటీన్‌ సినిమానేనా?

huse-expectations-on-jai-lava-kusa-with-ravana-character

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ హీరోగా రాశిఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్స్‌గా తెరకెక్కిన ‘జై లవకుశ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈనెల 21న చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆ సమయంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే జై, లవకుమార్‌, కుశల టీజర్‌లు విడుదలైన నేపథ్యంలో ఎవరు ఎలాంటి వారో తేలిపోయింది. ఇక ట్రైలర్‌లో కొత్తగా ఏమీ చూపించలేదు. ఆ పాత్రల గురించి మరింత డెప్త్‌గా చూపించారు.

ట్రైలర్‌లో చూస్తుంటే ఒక విషయం చాలా క్లీయర్‌గా అర్థం అవుతుంది. బ్యాంక్‌ మేనేజర్‌ అయిన లవకుమార్‌ స్థానంలోకి ఒక దొంగ అయిన కుశ వెళ్తాడు. ఏదో కారణం వల్ల లవకుమార్‌ కళ్లు కోల్పోవడం, అదే రూపలో ఉన్న కుశను బ్యాంక్‌ మేనేజర్‌గా పంపడం జరుగుతుంది. అక్కడ కుశ చేసే సందడి సినిమాతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నింపనుంది. ఇలాంటి కథలు గతంలో పలు తెలుగు సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తున్నాయి కదా. అయితే ఇందులో మరో పాత్ర అయిన జై రావణ్‌ మాత్రం సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. కొందరు ఈ సినిమాను రొటీన్‌ సినిమానే అంటూ తేల్చి పారేస్తుంటే మరి కొందరు మాత్రం ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్‌ ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. వంద కోట్లు సునాయాసంగా వసూళ్లు చేయడం ఖాయం అంటూ ట్రేడ్‌ పండితులు సైతం లెక్కలు చెబుతున్నారు 

మరిన్ని వార్తలు:

‘జై లవకుశ’ ట్రైలర్…ఎన్టీఆర్ నట విశ్వరూపం

ఎందుకు అదే అడుగుతున్నారు?

అర్జున్ రెడ్డి అభిమానుల జాబితాలో చ‌ర‌ణ్ కూడా…