Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఐఏఎస్ కు ఎంపిక కాకవటమంటే మాటలు కాదు..ఎంతో కష్టపడి చదవాలి. ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కోవాలి…చివరిదాకా వెనక్కితగ్గకుండా మొక్కవోని దీక్షతో ముందుకు సాగాలి. అలానే జీవితంలో అనుకున్న స్థాయికి చేరేందుకు ఎన్నోఆటుపోట్లును తట్టుకుని కలలు నెరవేర్చుకుంటున్నారు ఐఏఎస్ అధికారులు. కలెక్టర్ స్థాయికి చేరుకుని సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఆ కల నెరవేరిన తరువాత మాత్రం విధుల్లోనో, జీవితంలో నో ఎదురయ్యే సమస్యల్లో అదే ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. బీహార్ లోని బక్సర్ జిల్లా కలెక్టర్ ముఖేశ్ పాండే ఆత్మహత్యే ఇందుకు నిదర్శనం. జీవితం మీద విరక్తి కలిగిందంటూ సూసైడ్ నోట్ రాసి ఆయన ఆత్మహత్య చేసుకోవటం బీహార్ అధికార వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
2012 క్యాడర్ కు చెందిన ముఖేశ్ పాండే కొంతకాలంగా బక్సర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో ఒత్తిడి తట్టులేకపోవటమో, లేక వ్యక్తిగత కారణాలో తెలియదు కానీ..ఆయన వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ రైల్వేట్రాక్ పక్కన ముఖేశ్ మృతదేహం ఛిద్రమై పడిఉంది. మృతదేహం పక్కనే ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. ఢిల్లీ జనక్ పురి ప్రాంతంలోని ఓ భవనం పదో అంతస్తు పై నుంచి దూకి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ముఖే్శ్ ఆ లేఖలో రాశాడు. తనకు జీవితం మీద విరక్తి కలిగిందని, మానవ మనుగడపై నమ్మకం పోయిందని తన సూసైడ్ నోట్ ను ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో 742 వ గదిలో ఉన్న బ్యాగులో ఉంచానని, తనను క్షమించాలని కోరాడు. అయితే ఆయన ఢిల్లీలోచనిపోతున్నానని లేఖలో రాస్తే మృతదేహం మాత్రం ఘజియాబాద్ రైల్వే ట్రాక్ పక్కన దొరకటం సందేహాలుకు తావిస్తోంది. ఆయనది ఆత్మహత్యగానే భావిస్తున్న పోలీసులు ఎలా చనిపోయారనేదానిపై దర్యాప్తుచేస్తున్నారు. చనిపోవటానికి ముందు ముఖేశ్ తాను ఓ మాల్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన స్నేహితుడు ఒకరికి వాట్సప్ మెసేజ్ పెట్టారు. దీనిపై ముఖేశ్ స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులకు ముఖేశ్ మాల్ లో కనిపించలేదు. అయితే సీసీటీ
ఫుటేజీలో మాత్రం ముఖేశ్ మాల్ నుంచి మెట్రో స్టేషన్ వైపు వెళ్తున్నట్టుగా ఉంది. తర్వాత ఏం జరిగిందనేదానిపై స్పష్టత లేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఏదేమైనా…ఎంతో భవిష్యత్తు ఉన్న యువ ఐఏఎస్ అధికారి ఇలా బలవన్మరాణికి పాల్పడటం అత్యంత విషాదకరం.
మరిన్ని వార్తలు:
ఢిల్లీకి మారిన తమిళ సీన్
జగన్ పై ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ఫైర్
ఏది వైష్ణవాలయం..? ఏది శివాలయం..?