Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అవినీతి అంతం అమ్ఆద్మీ పంతం అంటూ ఒక విప్లవంలా దూసుకొచ్చింది “ఆప్”. మహా మహా పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపిలని మట్టికరిపించి డిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది. ఆ తర్వాతే అమ్ఆద్మీ గుండా ఆద్మీలా తయారయ్యింది. ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇంతకూ ముందు ఒక ఎమ్మెల్యే ఇంట్లో భార్య అరెస్ట్ అయితే ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు… ఏకంగా ఒక ఐఏఎస్‌నే కొట్టి కటకటాల మాటుకి వెళ్లారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి అప్ అదినేతకి ఎమ్మెల్యేలకి మధ్య గొడవకి కారణమై, ఐఏఎస్‌లు సియంకి వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చింది.
అసలేం జరిగింది? ఐఏఎస్‌లు సియంకి వార్నింగ్ ఇచ్చే రేంజ్ కి దారి తీసిన పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే… ఈమధ్య డిల్లీలోని రేషన్ కార్డులని అధార్ అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియలో ఏకంగా 2,40,000 దొంగ రేషన్ కార్డులు బయటపడ్డాయి. దీనితో ఆ రేషన్ కార్డులు అన్నింటిని తొలగిస్తూ డిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అసలు గోడవకి దారితీసింది. అ క్యాన్సిల్ చేసిన దొంగ రేషన్ కార్డులలో చాలావరకు అప్ కార్యకర్తలవే ఉండటంతో… ఆమ్ఆద్మీ ఎమ్మెల్యేలకు కోపం వచ్చింది. అర్ధరాత్రి చీఫ్ సెక్రెటరీకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్లో సమావేశానికి రమ్మని పిలిచారు. అక్కడే గొడవ పెద్దది అయింది ఆవేశాన్ని ఆపుకోలేని అప్ ప్రజాప్రతినిధులు అన్షు ప్రకాష్ పై కేజ్రివాల్ సమక్షంలోనే దాడికి దిగారు. ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుని బయటపడిన ఆయన వాళ్ళపై పోలీసులకు పిర్యాదు చేశారు. మెడికల్ టెస్టులు చేసిన వైద్యులు దాడి జరిగిన మాట వాస్తవమేనని… అయన కింది దవడ కదిలిపోయిందని చెప్పడంతో పోలీసులు అన్షు ప్రకాష్ పై దాడి చేసిన అప్ ఎమ్మెల్యేలు ప్రకాష్ జర్వాల్, అమనుతుల్లా ఖాన్ లను అరెస్ట్ చేశారు.
దీన్ని డిల్లీ సీఎం కేజ్రివాల్ ఖండించారు, తమ ఎమ్మెల్యేలను ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఆగ్రహంతో ఉగిపోయారు. ఐఏఎస్ అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. తమతోటి వాడి మీద చేసి తిరిగి తమపైనే విమర్శలు చేయడంతో… కేజ్రివాల్ తమకు క్షమాపణలు చెప్పేవరకు ఆందోళన చేస్తాం అని ఎట్టి పరిస్థితులలోను వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని ఐఏఎస్ అధికారుల సంఘం మండిపడింది. నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరయిన అధికారులు డిల్లీ సియం క్షమాపణ చెప్పకపోతే ప్రభుత్వం నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలకి, మీటింగ్‌లకి హాజరయ్యేది లేదని సీఎంకి వార్నింగ్ ఇచ్చారు.