Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అందరి కంటే ముందే సార్వజనీన ఓటుహక్కు ఇచ్చిన ఘనత. మహిళల్నీ పెద్దసంఖ్యలో ఓటింగ్ లో భాగస్వాముల్ని చేసిన నిబద్ధత. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఇండియాకు అంతా ప్లస్సే. అసలు రాజ్యాల సమాహారం ఏం నిలుస్తుంది అనుకుంటే… ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా రాజ్యాంగం రచించుకుని ఎవరికీ సాధ్యం కాని విలువల్ని ఆపాదించుకుంది ఇండియా.
స్వాతంత్ర్యం వచ్చిన మొదటి, రెండో దశాబ్దాలు ఇండియాకు స్వర్ణయుగం. ఎందుకంటే అప్పట్లో మన దగ్గర డబ్బుల్లేవు. ఎగుమతులు అనే మాటే తెలియదు. అన్నీ దిగుమతులే. అయినా సరే భారత్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఓ సంచలనం, గౌరవం. శాంతియుతంగా స్వాతంత్ర్యం ఎలా సాధించుకున్నారని అందరూ ఆశ్చర్యపోయి మరీ దేశానికి వచ్చి చూసి ఇంకా నివ్వెరపోయేవాళ్లు.
ప్రపంచంలో ఉన్నన్ని జాతులు ఇండియాలోనే ఉన్నాయని, అయినా సరే అందరూ ఏకతాటిపై నడవడం చిన్న విషయం కాదని అమెరికా దగ్గర్నుంచి ఆఫ్రికా దేశాల వరకూ అందరూ మెచ్చుకున్నారు. కానీ అదంతా ఘనమైన గతంలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం దేశభక్తి, ప్రయోజనాల కంటే స్వార్థం ఎక్కువైపోయింది. కుల,మత గొడవలు పెచ్చుమీరుతున్నాయి. విలువలు పెరగాల్సిందిపోయి.. తరిగిపోవడమే నేటి భారత ముఖచిత్రం.
మరిన్ని వార్తలు: