ఆ 20 మందిచేతిలో 10 % దేశ సంపద.

india get 10 percent income from businessman

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతరం తగ్గిపోతుందని మోడీ సర్కార్ పదేపదే చెప్పింది. అయితే కాలం గడుస్తోంది గానీ ఆ ఊహాలోకం ఎప్పటికీ వాస్తవరూపం దాల్చడం లేదు. పైగా అంతకంతకు ధనికులు ఇంకాస్త బలపడుతున్నారు. తాజాగా బ్లూమ్ బెర్గ్ సంస్థ వెల్లడించిన నివేదికలో ఈ విషయాలు బయటికి వచ్చాయి. ఈ నివేదిక చెప్పిన దాని ప్రకారం దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 10 శాతం సంపద కేవలం 20 మంది కుబేరులకే పరిమితం అయ్యిందట. ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలో ఆ 20 మంది సొమ్ము 3 , 32 ,637 కోట్లు పెరిగింది.

రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేష్‌ అంబానీ మొదటి ఏడు నెలల కాలంలో దాదాపు రూ.86,485 కోట్ల మేర సంపదను పెంచుకున్నారు. ముఖేష్‌కు తోడుగా ఇతర బిలియనీర్లయిన అదానీ గ్రూపునకు చెందిన గౌతమ్‌ అదానీ, విప్రో అజీమ్‌ ప్రేమ్‌జీ, డి-మార్ట్‌్‌ సూపర్‌ మార్కెట్స్‌ అధినేత ఆర్‌.కె.దామనీల సంపద దాదాపు రూ.19,958-26,611 కోట్ల (3-4 బిలియన్‌ డాలర్ల) మేర పెరిగినట్లుగా బ్లూమ్‌బర్గ్‌ సమాచార విశ్లేషణ తెలిపింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ షేర్లు తొమ్మిదేండ్ల గరిష్ట స్థాయిలో నమోదవుతూ వస్తున్నాయి. దీంతో సంస్థ మార్కెట్‌ విలువ దాదాపు రూ.5,25,000 కోట్లకు చేరింది.

2017 మొదటి ఏడు నెలల కాలంలో పెరిగిన కుబేరుల సంపద:

ముఖేశ్‌ అంబానీ 
వ్యాపారం: చమురు టెలికాం
పెరిగిన సంపద
రూ. 89,679 కోట్లు

గౌతమ్‌ అదానీ
వ్యాపారం: మౌళికం, పరిశ్రమలు
పెరిగిన సంపద
రూ. 27,941 కోట్లు

అజీమ్‌ ప్రేమ్‌జీ 
వ్యాపారం: టెక్నాలజీ
పెరిగిన సంపద
రూ. 25,280 కోట్లు

ఆర్‌.కె.దామని
వ్యాపారం: రిటైల్‌
పెరిగిన సంపద
రూ. 23,018 కోట్లు

ఉదరు కోటక్‌
వ్యాపారం: ఆర్థిక సేవలు
పెరిగిన సంపద
రూ. 21,421 కోట్లు

కుమర మంగళం బిర్లా
వ్యాపారం: పరిశ్రమలు
పెరిగిన సంపద
రూ. 20,823 కోట్లు

పంకజ్‌ పటేల్‌
వ్యాపారం: ఆరోగ్య సంరక్షణ
పెరిగిన సంపద
రూ. 16,964 కోట్లు

విక్రమ్‌ లాల్‌
వ్యాపారం: పరిశ్రమలుపెరిగిన సంపద
రూ. 14,636 కోట్లు

మరిన్ని వార్తలు:

వచ్చే ఏడాది సీఎంగా రజినీకాంత్‌!

అప్పుడు తండ్రి-ఇప్పుడు కొడుకు     

పవన్ కి రోజా డోలు…జయప్రకాశ్ సన్నాయి.