Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మన భారత దేశం లో ఆధ్యాత్మిక సంపద కి లోటు లేదు. ఇక్కడ అడుగు అడుగునా గుళ్ళు గోపురాలు లెక్కలేనన్ని ఉన్నాయి … యుగాల నుంచి వారసత్వ సంపదిగా తర తరాలు గా కాపాడుకుంటూ వస్తున్నాము. భారత దేశం లో మరి ముఖ్యం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యపరిచేవి గాను, వింత కలిగించేవి గాను ఉన్నాయి … అందులో ఒకదాని గురించి మాట్లాడుకుందాం.
మీరు ఎప్పుడైనా రాయి దిన దిన ప్రవర్ధమానం గా పెరుగుతూ ఉండటం చూసారా ? .. ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు గత ఇరవై ఏళ్ళు గా, విగ్రహ రూపం లో పెరగడం ఇప్పటికి ఆశ్చర్యకరమైన వింత గొలిపేటి సంఘటన నే… ఇది ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే మనం యాగంటి కి వెళ్లాల్సిందే ..ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని కర్నూల్ జిల్లా లో ఉన్నది. .. కాలజ్ఞానం రాసిన బ్రహ్మహం గారి ఊరు అయినా బనగామల్లి కి సరిగ్గా పన్నెడు కిలోమీటర్ ల దూరం లో ఈ క్షేత్రం ఉంది ..ఇక్కడ నందీశ్వరుడు కొలువై ఉన్నాడు ..ఈ పుణ్య క్షేత్రానికి రెండు ప్రత్యేకతలు కలవు ఒకటి నందీశ్వరుడు రోజు రోజు కి పెరుగుతూ ఉండటం ..
రెండవ ప్రత్యేకత ఈ క్షేత్రం పరిసరాల్లో ఎక్కడా కాకులు లేకపోవడం . ఈ నందీశ్వరుడి గురించి బ్రహ్మ్హం గారు తన కాల జ్ఞానం లో ఇలా చెప్పారు ..”కలియుగాంతాన యాగంటి బసవన్న రంకె వేసెను ” అని చెప్పాడు అట ..ఆనాటి నుంచి ఇది పెరుగుతూనే వస్తుంది … శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేసి “ఈ రాయి కి పెరిగే గుణం వున్నది కాబట్టి దిన దినము పెరుగుతూనే వున్నది ” అని తేల్చినా కూడా భక్తుల నమ్మకంన్ని మాత్రం అణుమాత్రమైన కదిలించలేకపోయారు ..
క్షేత్ర చరిత్ర …
చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఈ ప్రదేశం లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని సంకల్పించారట ..స్వామి వారి విగ్రహం మొదలు పెట్టి సగం వచ్చేవరకు ఆపేసారు కారణం ఏమిటి అంటే కాలి బొటనవేలు లో లోపాన్ని గమించారు…ఈ లోపల గుడి ని కట్టించే రాజు కి శివుడు కలలో కనిపించి నాకు ఇక్కడ గుడి కట్టించమని ఆదేశించాడట . ఇక్కడ ఉన్న శివలింగం లో శివుడు పార్వతి ఒకే లింగం లో దర్శనం ఇస్తారు ఇది మరో ప్రత్యేకత…
ఇక కాకులు కనిపించకపోవడం వెనుక ఒక పురాణ గాధ ఉంది ..అగస్త్య మహా ముని యాగం చేసేప్పుడు రాక్షసులు కాకి రూపం లో వచ్చి మాంసం ముక్కలను యాగ గుండం లో వేసి ఆటంకం కలిగించారట ..దానికి కోపగించిన ఆ మహా ముని ఈ క్షేత్రం లో కాకులు తిరగకూడదని శాపం ఇచ్చాడట…అప్పటినుంచి ఈ ఆలయం పరిసరాల్లో కాకులు తిరగవు. అగస్త్య మహాముని చేసిన యాగం వలెనే కాబట్టి ఈ క్షేత్రానికి యాగంటి అని పేరు వచ్చిందని ప్రతీతి.
అన్ని గుళ్ళలో నవగ్రహాలు ఉంటాయి కానీ ఈ ఆలయం లో ఎక్కడ కనిపించవు ఎందుకు అంటే ?, శని వాహనం కాకి అని తెలుసు కదా ముని శాపం వలన కాకి పై నిషేధం ఉన్నదీ కాబట్టి నేను ఇక్కడ ఉండను అని శనీశ్వరుడు చెప్తాడు …అందుకే ఈ ఆలయం లో నవగ్రహాలు ఉండవు. అవ్వడానికి శైవ క్షేత్రమే అయినా కూడా వైష్ణవాలయాన్ని పోలి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడి కోసం మొదలు పెట్టింది కాబట్టి శిల్ప చాతుర్యం అంతా వైష్ణవ సంప్రదాయం లోనే ఉంటుంది .
యాగంటి లో ఏర్పడిన గుహలన్నీ సహజసిద్దమైనవే. ఈ గుహల్లోనే అగస్త్య మహా ముని వెంకటేశ్వర స్వామి ని ప్రతిష్టించాడు. ఈ గుహలో వెలిసిన దేవుడికే పూజలు చేస్తారు అయితే ముందుగా చెప్పుకున్నట్టు బ్రహ్మ్హం గారు తన కాల జ్ఞానాన్ని ఈ గుహల్లో రచించారు అని చెప్పుకున్నాం కదా ఒక గుహలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉండగా, మరొక గుహ లో బ్రహ్మ్హం గారు కాల జ్ఞానాన్ని రచించారని, అలాగే తన శిస్యులకి జ్ఞాన బోధనా చేశారని అనుకుంటారు …దీనినే శంకర గుహ, అని రోకళ్ల గుహ అని కూడా పిలుస్తారు …
ఇక ఈ పుణ్య క్షేత్రం లో ప్రముఖం గా పిలవబడుతున్న యాగంటి బసవన్న స్వయంభువు అంటే నందీశ్వరుడు స్వయం గా వెలిసిన దేవుడు ..ఈ విగ్రహం లో జీవకళ ఉట్టిపడుతుంది. దీనిని .చూడగానే లేచి రంకె వేస్తుంది ఏమో అన్నట్టు గా అనిపిస్తుంది …ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతుండటం, పురావస్తు శాఖ వారు కూడా దేనిని గుర్తించడం తో రోజు రోజు కి దీనికి ఆదరణ పెరుగుగుంది అని చెప్పవచ్చు ..యుగాంతం తో ముడి పడే ఉన్న యాగంటి బసవన్న కి ప్రత్యేకత ఉన్నదీ అని చెప్పొచ్చు …చుట్టూ నల్లమల అడవుల మధ్య వెలిసిన ఈ ఆలయం ఓ అద్భుతం ..జీవితం లో ఒక్కసారి అయినా చూడాలి అనిపించే దేవాలయం …
ఎలావెళ్లి రావాలి ?
ఇక ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించాలని అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం బయలుదేరండి .. ఆగండి ఆగండి దారి ఎలాగో తెలియదు కదా ఇదిగో ఇలాగ అన్నమాట!
అయితే ఇక్కడ వసతి సౌకర్యాలు లేవు కాబట్టి బనగామ పల్లి లోను, నంద్యాలలో ను బస ని ఏర్పాటు చేసుకుంటే బాగుటుంది …. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ని కర్నూల్ జిల్లా నుంచి సరిగ్గా వంద కిలోమీటర్ ల దూరం లో ఈ క్షేత్రం ఉంది …. ఇక దీని తో పాటే చుట్టూ పక్కల ఉన్న సందర్శనీయ స్థలాలన్నీ చూసి రావొచ్చు … బనగామపల్లి, శ్రీశైలం, అహోబిలం, మహా నంది వంటివి ఉన్నాయి ..చక్కగా రెండు రోజులు ప్లాన్ వేసుకుంటే అన్ని చూసి రావొచ్చు …
ఓం నమః శివాయః !