Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాటి
నిర్మాత: సి. కళ్యాణ్
దర్శకత్వం : వి వి వినాయక్
సినిమాటోగ్రఫీ: ఎస్. వి. విశ్వేసర్
ఎడిటర్ : గౌతమ్ రాజు
మ్యూజిక్ : తమన్
మెగా మేనల్లుడు ‘సుప్రీమ్ హీరో’ సాయి ధరమ్ తేజ్… మెగాస్టార్ ఫ్యూచర్స్, పవర్ స్టార్ స్టైల్స్ తో మెగా అభిమానులను అలరిస్తున్నాడు. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస మూవీస్ తో దూసుకుపోతున్నాడు… ఇప్పుడు మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో, సి. కళ్యాణ్ నిర్మాణంలో ‘ఇంటిలిజెంట్ ‘ మూవీతో మనముందుకు వస్తున్నాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ఈ మూవీ, ఆ అంచనాలకు తగ్గట్టు ఉందో… లేదో.. తెలుసుకోవాలంటే ఒకసారి రివ్యూ లోకి వెళ్ళాల్సిందే….
కథ:
సాయి ధరమ్ తేజ్ ( సాయి ధరమ్ తేజ్ ) చిన్నతనం నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తే, వారికి తిరిగి హెల్ప్ చేస్తూ ఉంటాడు… నంద కిషోర్ (నాజర్) ఒక సాఫ్ట్ వేర్ కంపనీ నడుపుతూ, పేదలకు సేవ చేస్తుంటాడు… స్కూల్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిన ‘సాయి ధరమ్ తేజ్’ ను ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని మాట ఇస్తాడు. అలా ‘సాయి ధరమ్ తేజ్’ బాగా చదివి అదే కంపనీ లో జాబ్ చేస్తూ, నంద కిషోర్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ‘విక్కీ భాయ్'(రాహుల్ దేవ్) విదేశాలలో ఉంటూ ఇండియా లో మాఫియా ని రన్ చేస్తుంటాడు. ఒక రోజు ‘విక్కీ భాయ్’, నంద కిషోర్ ని బెదిరించి తన కంపనీ తన పేరు మీద రాయించుకుంటాడు, ఆ తర్వాత నంద కిషోర్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ విషయం తెలిసిన ‘సాయి ధరమ్ తేజ్’ ఆ మాఫియా ని అంతం చేయటానికి ఎలాంటి రూట్ ని ఎంచుకున్నాడు.? అసలు నంద కిషోర్ కంపెనీ ని మాఫియా ఖబ్జా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?, అసలు నంద కిషోర్ ఆత్మహత్య లేకా హత్య.? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘ఇంటిలిజెంట్ ‘ మూవీ చూడాల్సిందే…
విశ్లేషణ:
‘సాయి ధరమ్ తేజ్’ మొదటిసారి ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిలా నటించాడు. తన నటన, డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ‘చమ్మకు చమ్మకు’ రీమిక్స్ సాంగ్ లో చిరంజీవి ని బాగా ఇమిటేట్ చేసాడు. లావణ్య త్రిపాటి ఈ సినిమాలో కేవలం డాన్స్ లకి, అందానికే పరిమితం అయింది. ఇంటిలిజెంట్ ‘ మూవీ లో లావణ్య త్రిపాటి ఎప్పుడు కనపడితే అప్పుడు పాట వస్తుంటే ధియేటర్ లోని ప్రేక్షకులు అల్లాడిపోయారు. ఇక విలన్ ‘రాహుల్‌దేవ్’ ని మొదట్లో భయంకరంగా చూపించి, చివరకు ఎదవని చేస్తారు. ఇక కామెడీ విషయానికి వస్తే ఇంటిలిజెంట్ మూవీ లో చాలా మంది కమెడియన్స్ నటించారు. పోసాని, సప్తగిరి, జయ ప్రకాష్ నారాయణ, బ్రహ్మానందం, పృథ్వి తదితరులు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా తమ కామెడీతో ఆకట్టుకోలేకపోయారు.
మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ మూవీ తర్వాత డైరెక్టర్ వి వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న మూవీ అవ్వటంతో ‘ఇంటిలిజెంట్ ‘ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆకుల శివ అందించిన కథను తీసుకొని డైరెక్టర్ వి వి వినాయక్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ‘ఎవరైనా హెల్ప్ చేస్తే, వారికి తిరిగి హెల్ప్ చేయాలి’ అనే మంచి కాన్సెప్ట్ ను తీసుకొని ఈ సినిమాను రూపొందించడం జరిగింది. కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ, తెరకెక్కించిన విధానం మాత్రం పరమ రొటీన్ గా ఉంది. కొత్తదనం లేకుండా పాత స్క్రీన్ ప్లే తో హీరో ని బేస్ చేసుకొని వి వి వినాయక్ ఈ సినిమాని లాగించేసాడు. ఇలాంటి రకమైనా సినిమాలు, ఇలాంటి రకమైన స్క్రీన్ ప్లే మూవీస్ తెలుగులో చాలా సార్లు వచ్చాయి. ‘ప్రేక్షకులు ధియేటర్ లో మూవీ చూసినంత సేపు థ్రిల్ గా ఫీల్ అవ్వకపోగా, వారి సహనాన్ని కోల్పోవాల్సివస్తుంది.
ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకు ‘తమన్’ ఆకట్టుకునే మ్యూజిక్ ఇవ్వటం లో విఫలం అయ్యాడు. సాయి ధరమ్ తేజ్ – తమన్ కాంబో లో వచ్చిన నాలుగు మూవీ లు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి. ఈ సినిమాకు అయిన మంచి మ్యూజిక్ ఇస్తాడు ఏమో అని ఆశించిన ప్రేక్షకులకు చివరకు నిరాశే ఎదురయింది. ఒక్క ‘చమ్మకు చమ్మకు’ రీమిక్స్ సాంగ్ తప్ప మిగతా ఏ పాటలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ‘ఎస్.వి. విశ్వేసర్’ సినిమాటోగ్రఫీ బాగుంది, సాయి ధరమ్ తేజ్ ను, లావణ్య త్రిపాటి ని బాగా చూపించాడు. ముఖ్యంగా ‘చమ్మకు చమ్మకు’ రీమిక్స్ సాంగ్ లోని ప్రదేశాలను ఎస్.వి. విశ్వేసర్ బాగా తీసాడు. ఎడిటర్ ‘గౌతమ్ రాజు’ ఎడిటింగ్ లో ఆకట్టుకోలేకపోయాడు. ఒక పేపర్ ని నాలుగు ముక్కలు చేసి మళ్ళీ అతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.