రివ్యూవర్స్‌పై సినిమా వారి విమర్శలు సబబేనా?

is-tollywood-celebrities-comments-on-review-writers-is-correct

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘జైలవకుశ’ సక్సెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ రివ్యూవర్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. రివ్యూలు రాసేవారిని దారిన పోయే దానయ్యలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు సినిమా చూడకుండానే అప్పుడే రివ్యూలు ఇచ్చేసి సినిమా పోయింది అంటున్నారు అంటూ ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపాయి. రివ్యూవర్స్‌పై ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కొందరు కొట్టి పారేస్తున్నారు. ఎన్టీఆర్‌ అలా మాట్లాడాల్సింది కాదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మహేష్‌బాబు రివ్యూవర్స్‌ గురించి పాజిటివ్‌గా స్పందించినా, ఇటీవల రివ్యూవర్స్‌ గురించి వస్తున్న విమర్శలు కరెక్ట్‌ కాదని మొత్తం తెలుగు ప్రేక్షకులు అంతా కూడా అభిప్రాయ పడుతున్నారు.

సినిమా ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులు చూడని, రివ్యూలను బట్టి సినిమాలు చూసేది కేవలం 5 శాతం లోపు ప్రేక్షకులే అనే విషయాన్ని సినిమా వారు గుర్తించాలి. పెద్ద హీరో సినిమా అయితే రివ్యూలు ఎంత నెగటివ్‌గా వచ్చినా కూడా ఖచ్చితంగా చూడాల్సిందే అనుకునే ప్రేక్షకులు ఉన్నారు. సినిమాకు నష్టం జరిగేది కేవలం పబ్లిక్‌ నెగటివ్‌ టాక్‌ వల్లే అని, పబ్లిక్‌ చూసిన తర్వాత సినిమా గురించి వారు చెప్పే అభిప్రాయం ఎక్కువ మందికి చేరుతుంది. అప్పుడు సినిమాను చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. బ్యాడ్‌ రివ్యూల కారణంగా 5 శాతం మంది ప్రేక్షకులు సినిమాకు దూరంగా ఉంటే, బ్యాడ్‌ టాక్‌ వల్ల 80 శాతం ప్రేక్షకులు దూరంగా ఉంటారు.

ప్రేక్షకు సినిమాను చూడాలి అంటే మంచి కంటేంట్‌ ఉండాలి కాని, మంచి రివ్యూలు రావాలనుకోవద్దని, మంచి కంటెంట్‌ ఉంటే ఖచ్చితంగా మంచి రివ్యూలు వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సినిమాలను రివ్యూలు రాసి చంపేస్తున్నారు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. అది ఎంత మంది సమంజసమైన వాదన కాదు. అప్పట్లో ఎన్నో సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి, డిజాస్టర్స్‌ అయ్యాయి. మరి అప్పుడు ఇంతగా రివ్యూలు లేవు కదా. అంతెందుకు ఎన్టీఆర్‌ నరసింహుడు సినిమా కేవలం రెండు రోజుల్లోనే తీసేశారు. అప్పుడు ఇంతగా రివ్యూలు లేవు. అయినా ఆ సినిమా పరిస్థితి అలా ఎందుకు అయ్యింది. నెగటివ్‌ టాక్‌, సినిమా బాగా లేకపోవడం వల్ల. అందుకే రివ్యూవర్స్‌పై ఏడవడం మానేసి మంచి సినిమాలను ఎంచుకోవడం మంచిది.