Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటి శ్రీ రెడ్డి తన తల్లిని దూషించిన అనంతరం మొన్న అర్ధరాత్రి నుండి ట్వీట్ లతో విరుచుకుపడిన పవన్ తన ట్విట్టర్ లో లోకేష్, బాబు, రాధాకృష్ణ, శ్రీనిరాజు, వర్మ తదితరుల మీద పలు ఆరోపణలు చేశాడు. అయితే వర్మ ఇప్పటికే పవన్ కి కౌంటర్ ఇవ్వగా రాధాకృష్ణ, శ్రీనిరాజులు పవన్ మీద పరువు నష్టం దావా వేయడానికి సిద్దమయ్యారు. అయితే తన మీద వచ్చిన ఆరోపణల మీద లోకేష్ మాత్రం హుందాగా వ్యవహరించాడు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వరుసగా రెండోసారి తనపై పవన్ ఆరోపణలు చేశారంటూ లోకేష్ ట్వీట్ చేసాడు.
లోకేష్ మీద ఇంతకు ముందు పార్టీ ప్లీనరీ సందర్భంగా కూడా పవన్ సంచలన ఆరోపణలు చేసాడు. లోకేష్ అవినీతి తారాస్థాయికి చేరిందని..ఆయన తాత అయిన దివంగత ఎన్టీఆర్ ఈ తీరును చూస్తే క్షోభిస్తారని పార్టీ ప్లీనరీ వేదికగా పవన్ వ్యాఖ్యానించారు. అనంతరం ఈ వ్యాఖ్యల మీద టీడీపీ కౌంటర్లు ఇచ్చింది. ఎక్కడా వెనక్కి తగ్గకుండా పవన్ కళ్యాణ్ నీకు నాలుగేళ్ల తర్వాత లోకేష్ అవినీతి గుర్తుకు వచ్చిందా సరే అవినీతి జరిగింది అంటున్నావు అవినీతికి ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో నోటికి వచ్చిన బండలు లోకేష్ మీద వేసిన పవన్ ఇలా తెలుగుదేశం ఎదురు దాడి చేస్తుందని ఊహించక బొక్క బోర్లా పడినట్టు అయ్యింది. దీంతో వెంటనే ఆత్మా రక్షణలో పడిన పవన్ ఎవరో చెబితే ఈ మాటలు అన్నానని కవర్ చేసుకున్నాడు.
అయితే తాజాగా లోకేష్ మీద బురద చల్లేందుకు మరలా ప్రయత్నించిన పవన్, శ్రీరెడ్డితో తన తల్లిని తిట్టించింది లోకేష్ అంటూ ట్విట్ చేసాడు. టీడీపీ అనుకూల మీడియాతో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, సచివాలయం సాక్షిగా ఈ కుట్రలు సాగుతున్నాయని కూడా పవన్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో లోకేష్ స్పందించారు. ట్విట్టర్లో రెండు ట్వీట్లతో తన ఆవేదనను పంచుకున్నాడు. `పవన్ కళ్యాణ్ గారు మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ` అంటూ రెండు ట్వీట్లలో తన బాధని లోకేష్ వెళ్లగక్కారు. అయితే కొద్ది రోజులుగా లోకేష్ ని పవన్ టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ. (2/2)
— Lokesh Nara (@naralokesh) April 20, 2018