ఏపీలో ఐటీ సోదాలు జరిగింది వీరి మీదే !

It Raids On southern Developers And Vrl Logistics In Ap

విజయవాడ భారీగా చేరుకున్న ఐటి అధికారులు విడిపోయారు. ఏరియాల వారీగా విడిపోయిన వారు దాడులకి దిగినట్టు తెలుస్తోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగి మీడియాకి సమాచారం వచ్చిన చోట్ల వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలో అక్కడి సదరన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, దాని యజమాని ఇల్లు, కార్యాలయాల్లో ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సదరన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన విజయవాడలోని కంపెనీ ప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అంతేకాక విజయవాడ, గుంటూరులోని వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీల్లో కూడా సోదాలు సాగుతున్నాయి. అంతేకాక విశాఖ జిల్లాలో ఐటీ అధికారుల దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ రియల్టర్, వ్యాపారి శంకర్రావు అతని కుమారుడు కల్యాణ్ చక్రవర్తి ఇళ్ళ మీద దాడులు జరుగుతన్నాయి. ఇవే కాక శుభగృహ మరియు NSR హౌసింగ్ కంపెనీలపై దాడులు జరుగుతున్నాయి. భూములు అమ్మకాలు కొనుగోళ్ళు పై అవకతవకలకు పాల్పడినట్లు ఆయా సంస్థల మీద ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. GST ఫాలో అవకపోవడంపై ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు చేసినట్టు సమాచారం.

ఏపీలో ఐటీ సోదాలు జరిగింది వీరి మీదే ! - Telugu Bullet

అంతే కాక విజయనగరం జి.ఎస్.టి కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్లు ఉమా మహేశ్వరరావు, మోహనరావు నేతృత్వంలో కాశీబుగ్గ అసిస్టెంట్ కమిషనర్ భానుమతి మరియు సిబ్బంది ఏక కాలంలో కల్యాణ్ దాస్ గంగ్వాని ఇంటి పైన , గొడౌన్ పై మెరుపు దాడులు నిర్వహించారు. పలాసలో ఆయన ఒక జీడిపప్పు ట్రేడ్ వ్యాపారి. అంతేకాక పలాసలోని ఆయుష్ ట్రేడర్స్ గొడౌన్ పైనా దాడులు. జీడిపప్పు, బిల్లులను పరిశీస్తున్న అధికారులు. ప్రస్తుతం ఉన్న సమాచరం మేరకు ఈ చట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు పూర్తి సమాచారం అందాల్సి ఉంది.