Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పూచికపుల్లగా తీసిపారేసి ఐవైఆర్ కృష్ణారావు టీడీపీ సర్కార్ మీద తిరుగుబాటు చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ రాజకీయ నాయకుడు ఇలా చేస్తే పెద్ద విశేషం లేదు గానీ ఓ మాజీ ఐఏఎస్ ఇలా చేయడం మాత్రం అంత తొందరగా మింగుడుపడడం లేదు. అయితే కృష్ణారావుకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వెనుక ఎవరున్నారు అని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుజూస్తున్నాయి. కొందరు ఐఏఎస్ లు ఆఫ్ ది రికార్డు చెబుతున్న దాని ప్రకారం ఐవైఆర్ తిరుగుబాటు వెనుక పెద్ద విషయమే దాగి వుంది.
కొందరు ఐఏఎస్ మిత్రులు చెబుతున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అనుకున్నట్టే 2014 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఐవైఆర్ కూడా భావించారట. వైసీపీ గెలిస్తే ప్రకాశం జిల్లా దొనకొండ రాజధాని అవుతుందని అంచనా వేసారట. తన వంతుగా దొనకొండ రాజధాని అయితే బాగుంటుందని ఆయన ఓ నివేదిక తయారు చేసి శ్రీకృష్ణ కమిటీ కి సమర్పించారట. అంతటితో ఆగకుండా దొనకొండలో బినామీ పేర్లతో కొన్ని భూములు కూడా కొన్నారట ఐవైఆర్. కానీ ఆయన అంచనాలన్నీ తప్పాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. దొనకొండ కి బదులు అమరావతి రాజధాని అయ్యింది. అయితే సీఎస్ పదవి రావడంతో ఐవైఆర్ ఆ అసంతృప్తి కనబడకుండా మేనేజ్ చేశారు. ఆపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా రావడంతో నోరు కుట్టేసుకోవాల్సి వచ్చింది. అయితే లోలోన రగులుతున్న అగ్నిపర్వతం అప్పుడప్పుడు లావాని ప్రవహింపజేసినట్టు అడపాదడపా కృష్ణారావు టీడీపీ సర్కార్ మీద సన్నిహితుల దగ్గర ఆడిపోసుకుంటూనే ఉన్నారట. ఇక రెండేళ్లలో ఎన్నికలు అనగానే ఉక్రోషం పట్టలేక సోషల్ మీడియా వేదికగా టీడీపీ ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేసి కృతఘ్నతకి మారు పేరుగా నిలిచారు. మొత్తానికి దొనకొండలో తాను కొన్నాక భూముల ధరలు తగ్గడం తోనే ఐవైఆర్ ఇంతకి తెగించాడని ఆయన తోటి ఐఏఎస్ లే చెబుతున్న మాటలు వింటుంటే ఆమ్మో ఐవైఆర్ అనిపిస్తోంది.
మరిన్నివార్తలు