Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
IYR Krishna Rao Comments On Chandrababu Govt
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటు పడిందని ఆయన చాలా హర్టయ్యారట. తనను డైరక్టుగా అడిగితే వివరణ ఇవ్వడమే కాకుండా రాజీనామా కూడా చేసేవారట. ఇక ఐవైఆర్ చెప్పిన మరో మాట మాత్రం పెద్ద కామెడీ అయిపోయింది. పొలిటీషియన్స్ చెవిలో పువ్వులు పెట్టిన లెవల్లో తాను జీతం తీసుకోకుండా పనిచేస్తున్నానని, క్యాబినెట్ హోదా కూడా ఇవ్వలేదని ఐవైఆర్ చెప్పడం చిత్రాల్లో కెల్లా చిత్రం. అసలు అధికారులు కాస్త మర్యాద తగ్గితేనే పనిచేయరు. అలాంటిది కార్పొరేషన్ ఛైర్మన్ గా జీతం తీసుకోకుండా కమ్యూనిటీని ఉద్ధరిస్తున్నానని కృష్ణారావు చెప్పిన మాటల్ని… బ్రాహ్మణులే నమ్మడం లేదు.
బ్రాహ్మణులకు టీడీపీ అంటే మొదట్నుంచీ కాస్త వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. కానీ చంద్రబాబు హయాంలో కార్పొరేషన్ కు దండిగా నిధులు సమకూర్చడంతో వారిలో సానుకూలత బాగా పెరిగింది. అలాంటి సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ పోస్టులు షేర్ చేయాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నకు మాత్రం కృష్ణారావు దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వంలో పని చేస్తున్నప్పుడు వ్యక్తిగత హోదా, అధికార హోదా ఇలా ఇన్ని హోదాలు ఉండవు. ఎంతో కొంత నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఐవైఆర్ ఆ విషయాలు గాలికొదిలేశారు.
సరే టీడీపీనే తప్పు చేసిందనుకుందాం. మరి ఐవైఆర్ చేసిన ఒప్పేంటి. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా సొంత మైలేజీ కోసం ప్రయత్నించడం తప్పు కాదా. బ్రాహ్మణులకు సేవ పేరుతో తనకు భజన చేయాలనుకోలేదా అంటే కృష్ణారావు సమాధానం చెప్పరు. ఎంపీలు జేసీ, నానితో తనను పోల్చుకోవడం ఐవైఆర్ కు ఆత్మహత్యా సదృసమే. వారి పేర్లు ప్రస్తావించడం టీడీపీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యమే. అసలు ఆ విషయంతో ఐవైఆర్ కు సంబంధం లేదు. పైగా పదవి ఊడిపోయిందని తెలియగానే… నిజాలు పజల్లోకి వెళ్లడం లేదని చెప్పడం చూస్తుంటే… బాబు చెబితే అబద్ధాలు ఐవైఆర్ చెబితే నిజాలనా అని సెటైర్లు పడుతున్నాయి.