ఆ ముగ్గురి నోటికి తాళాలు… ప్రశాంత్ కూరలో కరివేపాకు?

jagan fires on Kodali Nani Chevireddy and Roja behavior

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వాళ్ళు నోరు తెరిస్తే వైసీపీ శ్రేణులు ఈల వేస్తాయి. వాళ్ళు ప్రత్యర్థుల్ని తన వాగ్ధాటితో చీల్చి చెండాడుతుంటే అధినేత జగన్ చిరునవ్వుతో ఆస్వాదించేవాళ్ళు. అయితే అదంతా గతం. అదంతా ఓ లెక్క. ప్రశాంత్ కిషోర్ వచ్చాక ఇంకో లెక్క . రోజా, చెవిరెడ్డి, కొడాలి నాని లాంటి దూకుడు మాస్టర్స్ వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదని ప్రశాంత్ చెప్పారు. జగన్ పాటిస్తున్నారు. దీనికి సంబంధించి రోజా మీద జగన్ ఫైర్ అయ్యారని ఓ వైపు మీడియా కోడై కూస్తున్నా అబ్బే ఆమెకి ఆరోగ్యం బాగా లేక విశాఖ మహాధర్నాకు రాలేదని వైసీపీ పెద్దలు వివరణ ఇస్తున్నారు. అయితే ఆమెతో పాటు చెవిరెడ్డి, కొడాలి నాని లాంటి వాళ్ళు సైలెంట్ అవ్వడం చూస్తుంటే పార్టీ లోపల ఏమి జరిగిందో తేలిగ్గానే అర్ధం అవుతుంది. అయితే ఈ కోవలో ఇంకో గొంతు ఇప్పటికీ కంగుకంగుమని మోగుతూనే వుంది. అదే అంబటి రాంబాబుది. ఆయనకి మాత్రం ఎందుకు ఈ షరతు వర్తించడం లేదో వైసీపీ శ్రేణులకు అర్ధం కావడం లేదు.

నిజానికి వైసీపీ ముక్కుతాళ్లు వేసిన నేతలందరికీ వారి వారి నియోజకవర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అంతో ఇంతో మద్దతు వుంది. ప్రజాకర్షణ వుంది. వారి వాగ్ధాటికి మైమరిచిపోయే వాళ్ళున్నారు. కానీ మిగతావారితో పోలిస్తే అంబటికి వ్యక్తిగతంగా ఆ చరిష్మా లేదనే చెప్పుకోవాలి. ఇదంతా చూస్తుంటే ప్రశాంత్ చెప్పాడని జగన్ కొందరి నోటికి తాళం వేశాడా లేక ఆ ప్రశాంత్ పేరు వాడుకుని తానే వారికి ముక్కుతాళ్లు వేశాడా అన్నది అర్ధం కావడం లేదు. ఈ డౌట్ రావడం లో ఏ తప్పు లేదు. ఎందుకంటే… రోజా, చెవిరెడ్డి, కొడాలి నాని లాంటి వాళ్ళ నోటికి తాళం వేసాక విశాఖ మహాధర్నా లో జగన్ మాట్లాడిందేమిటి? చంద్రబాబు, లోకేష్, మంత్రులు, అధికారుల్ని సిబిఐ లోపల వేసి తంతుందన్న భాష వాడేశారు. ఈ భాష తగదని కొందరికి స్పీడ్ బ్రేకర్ వేసి జగన్ తానే ఆ భాష వాడడంలో అర్ధం ఏమిటో… ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే జగన్ ఆలోచన అమలు చేయడానికి, పార్టీ లో తానొక్కడే స్టార్ కాంపైనర్ గా ఉండడానికి ప్రశాంత్ పేరు వాడుకున్నారని అనిపించడం లేదా! ఇప్పుడు ఈ ముగ్గురు కూరలో కరివేపాకు అయ్యారు. ఆ తర్వాత అంటే 2019 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా అంతే అవ్వరా ?

మరిన్నివార్తలు 

కేవీపీ మళ్లీ జగన్ కు దగ్గరయ్యారా..?